News March 1, 2025

PPM: టి.బి. రోగులకు నిక్షయ్ మిత్రలుగా సహకరించాలి

image

ప్రధాన మంత్రి టి.బి. ముక్త్ భారత్ అభియాన్ (PMTBMBA) పథకం కింద టి.బి. రోగులకు పోషకాహార సహకారం అందించనున్నారు. ఈ షౌష్టికాహారాన్ని పొందేందుకు నిక్షయ్ మిత్రలుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఇందులో నమోదు చేసుకున్న టి.బి. రోగులకు నెలకు రూ. 700 చొప్పున గరిష్టంగా 6 నెలల వరకు, మొత్తం రూ. 4200 ఆర్థిక సహాయం అందుతుందని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Similar News

News January 11, 2026

గద్వాల్: ఉచిత కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లిష్‌ శిక్షణ

image

గద్వాల్ జిల్లా కేంద్రంలోని భీంనగర్ పీఎంకేకే (PMKK) సెంటర్‌లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎంఎస్ఎంఈ (MSME) ఆధ్వర్యంలో 45 రోజుల పాటు కంప్యూటర్ కోర్సులు, స్పోకెన్ ఇంగ్లిష్‌లో శిక్షణ కల్పిస్తారు. 18 నుంచి 45 ఏళ్ల లోపు వారు అర్హులు. ఆసక్తి గల వారు SSC మెమో, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 17వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News January 11, 2026

తప్పు ఒప్పుకొన్న X.. అశ్లీల పోస్టుల తొలగింపు

image

కేంద్ర ప్రభుత్వం హెచ్చరికతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X దిగొచ్చింది. గ్రోక్‌లో అశ్లీల కంటెంట్‌పై గతవారం <<18795355>>IT శాఖ సీరియస్<<>> అవ్వడంతో X యాజమాన్యం స్పందించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్లాట్‌ఫామ్‌లో ఉన్న 3,500 అశ్లీల పోస్టులను బ్లాక్ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన 600 అకౌంట్లను పూర్తిగా తొలగించింది. తమ మోడరేషన్‌లో లోపాలున్నాయని అంగీకరించింది. భారత చట్టాలకు లోబడి పనిచేస్తామని ప్రభుత్వానికి హామీ ఇచ్చింది.

News January 11, 2026

కోనసీమ: ఓడలరేవు తీరంలో ప్రమాదం

image

అల్లవరం మండలం ఓడలరేవు తీరంలో కోత నివారణకు ONGC ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రక్షణ కవచం పనుల్లో ప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద రాళ్లను అన్‌లోడ్ చేస్తున్న సమయంలో ఒక లారీ అదుపుతప్పి ఒక్కసారిగా తిరగబడింది. తీర ప్రాంతంలో పనులు వేగంగా జరుగుతున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.