News February 19, 2025

PPM: డీఐఈఓకు ఆచార్య దేవోభవ అవార్డు

image

పార్వతీపురం జిల్లా ఇంటర్మీడియట్ విద్యా శాఖ అధికారి డి.మంజుల వీణ‌కు ఆచార్య దేవోభవ అవార్డు లభించింది. గణిత శాస్త్ర అధ్యాపకురాలుగా, ఉమ్మడి జిల్లాల ఆర్‌ఐ‌ఓగా, పార్వతీపురం జిల్లా ఇంటర్మీడియట్ విద్యా శాఖ అధికారిగా సేవలు అందించారు. ఈ మేరకు ప్రియదర్శిని సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్  2025 ఏడాదికి ఈ అవార్డును అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ మంజుల వీణను బుధవారం అభినందించారు.

Similar News

News November 1, 2025

అమలాపురం: జిల్లా డీఐఈఓగా విజయశ్రీ

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా (డీఐఈఓ) రాజమండ్రి డీఐఈఓ డి.విజయశ్రీ శనివారం ఇన్‌ఛార్జి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు డీఐఈఓగా పనిచేసిన సోమశేఖర రావు పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో ఆమె ఫుల్ అడిషనల్ ఛార్జ్ (ఎఫ్‌ఏసీ)గా బాధ్యతలు స్వీకరించారు. తనకు అప్పగించిన అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఈ సందర్భంగా డీఐఈఓ విజయశ్రీ పేర్కొన్నారు.

News November 1, 2025

ఎర్రవల్లి: ఫుడ్ పాయిజన్ ఘటనపై హెచ్‌ఆర్‌సీ స్పందన

image

ఎర్రవల్లి మండలం ధర్మవరం బీసీ వసతి గృహంలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగిన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సీ) శనివారం స్పందించింది. దీనిని సుమోటో కేసుగా స్వీకరించిన కమిషన్.. ఘటనపై పూర్తి విచారణ చేసి, అస్వస్థతకు గల కారణాలు, విద్యార్థుల ఆరోగ్య స్థితి, నిర్లక్ష్యానికి కారణమైన వారిపై తీసుకున్న చర్యలతో కూడిన నివేదికను ఈ నెల 24లోపు ఇవ్వాలని సీఎస్‌ను కోరింది.

News November 1, 2025

పంట నష్టపోయిన ప్రతి రైతుకూ న్యాయం చేస్తాం: మంత్రులు

image

మొంథా తుఫాన్ ప్రభావం వల్ల పంట నష్టపోయిన ప్రతి రైతుకు, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని మంత్రులు ఎన్ఎండీ ఫరూక్, బీసీ జనార్ధన్ రెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో మొంథా తుఫాను ప్రభావం వల్ల నష్టపోయిన పంట పొలాలు, నష్ట ప్రభావిత ప్రాంతాలపై కలెక్టర్ రాజకుమారి, అధికారులతో సమీక్షించారు. ప్రత్యేక నిధులు కేటాయించి రోడ్లను అభివృద్ధి చేస్తామని మంత్రి బీసీ తెలిపారు.