News February 7, 2025

PPM: నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి పి-4 మోడల్

image

నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్‌షిప్ (పి-4) ఒక కీలకమైన సాధనమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ పేర్కొన్నారు. గురువారం ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. ప్రభుత్వం, ప్రైవేట్ రంగం, ప్రజల భాగస్వామ్యంతోనే రాష్ట్రం వేగవంతమైన అభివృద్ధిని సాధించగలదని అన్నారు.

Similar News

News October 17, 2025

యూసుఫ్‌గూడ: అవిభక్త కవలలు వీణా-వాణిల పుట్టినరోజు వేడుకలు

image

అవిభక్త కవలలు వీణా-వాణిల 23వ జన్మదిన వేడుకలను యూసుఫ్‌గూడలోని స్టేట్ హోమ్‌లో గురువారం నిర్వహించారు. తమ పిల్లల సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకొని తమను ఆదుకుంటుందని తల్లిదండ్రులు తెలిపారు. అలాగే, వైద్యరంగంలో జరిగిన అభివృద్ధితో తమ బిడ్డలైన అవిభక్త కవలలను విడదీసి సంపూర్ణ ఆరోగ్యంతో తమకు అప్పగించాలని కోరుతున్నారు.

News October 17, 2025

గుండ్లకమ్మ ప్రాజెక్టుపై అధికారులకు కలెక్టర్ సూచనలు

image

గుండ్లకమ్మ ప్రాజెక్ట్ కింద 50 ఎకరాల భూసేకరణ చేయకపోవడంతోనే బాపట్ల జిల్లాలోని 13,876 ఎకరాలకు సాగునీరు రావడంలేదని కలెక్టర్ వినోద్ కుమార్ గురువారం చెప్పారు. ఇంకొల్లు మండలం దుద్దుకూరులో 50 ఎకరాల భూసేకరణ పనులు నిలిచిపోవడంపై ఆరా తీశారు. తక్షణమే భూ సేకరణకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం గుండ్లకమ్మ ప్రాజెక్ట్ 14 గేట్లు మరమ్మతులు పూర్తి కాగా, మరొకదానికి పనులు జరుగుతున్నాయన్నారు.

News October 17, 2025

NRPT: ‘పెండింగ్ ఉన్న ఓటరు దరఖాస్తులు పరిష్కరించాలి’

image

పెండింగ్‌లో ఉన్న ఓటరు దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు. BLOలకు గుర్తింపు కార్డులు అందించాలని, ఓటరు గుర్తింపు కార్డులను అందించాలని చెప్పారు. ప్రతి బూత్‌కు అధికారిని నియమించాలని సూచించారు.