News February 6, 2025

PPM: నిర్ణిత కాల వ్యవధిలోగా మ్యూటేషన్లు పరిష్కరించాలి

image

రీసర్వే, రెవెన్యూ సదస్సులు, మీ సేవా పోర్టల్ ద్వారా వచ్చే మ్యూటేషన్లను నిర్ణిత కాల వ్యవధిలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తహశీల్దార్లకు సూచించారు. 30 రోజులు దాటి ఒక్క రోజు ఆలస్యమైన సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెవెన్యూ సమస్యలపై సబ్ కలెక్టర్లు, తహశీల్దార్లు, రెవిన్యూ అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో గురువారం సమీక్షించారు.

Similar News

News January 9, 2026

కరీంనగర్: ‘బాలికలను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలి’

image

కేజీబీవీ విద్యార్థినులను విద్యావంతులుగా మార్చి, అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దాలని కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను కోరారు. ‘నీపా’ (NIEPA) సౌజన్యంతో కేజీబీవీ ప్రత్యేక అధికారులు, వార్డెన్లకు నిర్వహిస్తున్న ఐదు రోజుల శిక్షణలో ఆమె మాట్లాడారు. బాలికలు స్వశక్తితో ఎదిగేలా ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ డైరెక్టర్ దేబోర కృపారాణి అధికారులు పాల్గొన్నారు.

News January 9, 2026

విశాఖ అభివృద్ధిపై ప్రత్యేక నిఘా: మంత్రి డోలా

image

విశాఖను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ‘గ్లోబల్ సిటీ’గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వీరాంజనేయ స్వామి తెలిపారు. శుక్రవారం విశాఖ కలెక్టరేట్‌లో జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నగరంలో వినిపిస్తున్న శానిటేషన్ సమస్యలను జనవరి చివరి నాటికి పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. మహిళల భద్రత కోసం నగరాన్ని చీకటి ప్రాంతాలు లేని ‘ఇల్యుమినేషన్ సిటీ’గా మార్చాలన్నారు.

News January 9, 2026

విశాఖలో ఎరువుల లభ్యతపై వ్యవసాయ శాఖ స్పష్టత

image

విశాఖ జిల్లాలో రబీ పంటల సాగుకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి (DAO) తెలిపారు. జిల్లాకు జనవరి వరకు 1096 టన్నుల యూరియా అవసరం కాగా.. 1651 టన్నులు అందుబాటులో ఉంచామన్నారు. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 1073 టన్నుల ఎరువులు (యూరియా 600 టన్నులు) నిల్వ ఉన్నాయని, ఇవి జనవరి చివరి వరకు రైతులకు సరిపోతాయని పేర్కొన్నారు.