News March 17, 2025
PPM: పదో తరగతి పరీక్షలను పరిశీలించిన కలెక్టర్

పార్వతీపురం జిల్లాలో సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ పార్వతీపురం ఆర్.సి.యం. సెయింట్ పీటర్స్ (ఇ.యం) హై స్కూల్లో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షలను పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన మౌలిక వసతులను, పరీక్షా నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు.
Similar News
News March 18, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు ∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} ఏన్కూర్: శ్రీలక్ష్మీనర్సింహాస్వామి ఆలయంలో వేలం పాట ∆} నేలకొండపల్లి రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు∆} మధిరలో ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి పర్యటన
News March 18, 2025
నేడు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ

TG: ఇవాళ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ జరగనుంది. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు మాట్లాడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వనున్నట్లు సమాచారం. నిన్న ఈ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ సభలో ప్రవేశపెట్టారు. దీంతో పాటు యాదాద్రి బోర్డు ఏర్పాటుపై బిల్లు, అడ్వకేట్ వెల్ఫేర్, అడ్వకేట్ క్లర్క్ వెల్ఫేర్ ఫండ్, మున్సిపాలిటీల సవరణ బిల్లు, పంచాయతీ రాజ్ సవరణ బిల్లులకు సభ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
News March 18, 2025
వెదురుకుప్పం: మహేశ్ మృతదేహాన్ని అప్పగించాలంటూ నిరసన

వెదురుకుప్పం మండలంలోని కొమరగుంట గ్రామానికి చెందిన మహేశ్ హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడు. తాను నివసిస్తున్న గదిలో ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు తెలియజేశారు. మహేశ్ మృత దేహాన్ని అప్పగించాలంటూ వెదురుకుప్పం -పచ్చికాపల్లం రహదారి మార్గంలో కొమరగుంట క్రాస్ రోడ్డులో మంగళవారం బంధువుల ఆందోళన చేపట్టారు. మహేశ్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.