News February 19, 2025

PPM: పాలకొండ నగర పంచాయతీ చైర్‌పర్సన్ ఎన్నిక మరోసారి వాయిదా

image

పాలకొండ నగర పంచాయతీలో చైర్‌పర్సన్ ఎన్నికకు తగినంత కోరం లేకపోవడంతో ఎన్నిక నిలిచినట్లు సబ్ కలెక్టర్లు సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, ఎస్.ఎస్ సోభిత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం నాల్గో సారి మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి ఎన్నిక నిర్వహించగా మళ్లీ వాయిదా పడినట్లు వారు వివరించారు. ఈ ఘటనపై ఎలక్షన్ కమిషనర్‌కు నివేదిక ఇవ్వనున్నట్లు సబ్ కలెక్టర్లతో పాటు మున్సిపల్ కమిషనర్ ఎస్.సర్వేశ్వరరావు చెప్పారు.

Similar News

News March 25, 2025

క్షయ వ్యాధి నియంత్రణలో జిల్లాకు మొదటి స్థానం జిల్లా కలెక్టర్

image

MBNR జిల్లావ్యాప్తంగా 2,087 మందికి టీబీ లక్షణాలు ఉన్న రోగులను గుర్తించి చికిత్స అందించడంతో 1,218 మంది బాగుపడ్డారని ఇందుకుగాను రాష్ట్ర టీబీ నియంత్రణ విభాగం జిల్లాకు మొదటి స్థానం ఇచ్చిందని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా వివరించారు. మిగిలిన 1,767 మంది రోగులకు నెలకు రూ.వేయి చొప్పున వారికి చెల్లిస్తున్నామన్నారు.

News March 25, 2025

పిల్లల్లో కంటి చూపు సమస్యలు.. నివారణ ఇలా

image

చాలా మందికి చిన్నతనంలోనే కంటి చూపు సమస్యలొస్తున్నాయి. ఎక్కువ స్క్రీన్ టైమ్, లో లైట్‌లో చదవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటివి దీనికి కారణాలు. ఈ సమస్య పోయి కంటిచూపు మెరుగుపడాలంటే స్క్రీన్ టైమ్ తగ్గించుకోవడంతో పాటు సహజ కాంతి, పచ్చని వాతావరణంలో ఆడుకోవడం, సరైన ఆహారం తీసుకోవడం (క్యారెట్, పాలకూర, టమాట, బాదం, వాల్‌నట్స్), కంటి వ్యాయామాలు, రోజూ 8-10hrs నిద్రపోవడం వంటివి పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

News March 25, 2025

ADB: అక్రెడిటేషన్ గడువు పొడగింపు

image

మీడియా అక్రెడిటేషన్ కార్డుల గడువు ఈనెల 31 వరకు ముగియనున్న నేపథ్యంలో వాటి గడువు మరో మూడు నెలలు పొడగించినట్లు ఆదిలాబాద్ పౌర సంబంధాల అధికారిణి తిరుమల పేర్కొన్నారు. గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. జిల్లాలోని పాత్రికేయుంతా మంగళవారం నుండి అక్రెడిటేషన్ కార్డ్స్ పై స్థిక్కర్లు వేయించుకోవాలి కోరారు.

error: Content is protected !!