News January 25, 2025
PPM: ‘ప్రపంచాన్నే మార్చకలిగే శక్తిమంతులు బాలికలు’

బాలికల హక్కులను పరిరక్షిస్తూ, వారి అవసరాలను తీర్చగలిగితే సమాజంతో పాటు, ప్రపంచాన్ని మార్చకలిగే శక్తిమంతులు బాలికలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా మహిళలు, బాలికల కొరకు ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించడమే సమాజంలో మహిళలకున్న గౌరవాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించేందుకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాయని అన్నారు.
Similar News
News December 22, 2025
కామారెడ్డి: ప్రజావాణిలో 60 దరఖాస్తులు

కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణిలో మొత్తం 60 దరఖాస్తులు స్వీకరించినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతున్నదని తెలిపారు. తక్షణమే సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News December 22, 2025
HYD: జనవరి 13 నుంచి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్..!

HYDలో సంక్రాంతి సందర్భంగా వచ్చే నెల జనవరి 13 నుంచి 15 వరకు ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ పరేడ్ గ్రౌండ్లో జరగనుంది. సీఎం ఆదేశాల మేరకు ఏర్పాట్లను సీఎస్ రామకృష్ణారావు సోమవారం సమీక్షించారు.వివిధ దేశాల నుంచి ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నాను. ఈ ప్రోగ్రాంతో రంగురంగుల గాలిపటాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో HYD నగరం పండుగ ఉత్సాహంతో కళకళలాడనుంది.
News December 22, 2025
జనగామ: ఒకే బడి.. ఒకే తరగతి.. ముగ్గురు విజేతలు!

జిల్లాలోని రఘునాథపల్లిలో ముగ్గురు బాల్య స్నేహితుల విజయం ఆకర్షణగా నిలిచింది. ఒకే బడి, ఒకే తరగతిలో చదువుకున్న కడారి మహేందర్, బాలగోని శ్రీనివాస్, సమ్మయ్య వేర్వేరు వార్డుల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన తాము, ఇప్పుడు గ్రామ అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని వారు చెబుతున్నారు. తమపై నమ్మకముంచిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమని స్పష్టం చేశారు.


