News March 15, 2025

PPM: మూడు అంబులెన్స్‌లను అందించిన NPCI

image

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పార్వతీపురం మన్యం జిల్లాకు మూడు అంబులెన్స్‌లను అందించారు. ఈ అంబులన్స్‌లను సాలూరులో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించగా, పార్వతీపురంలో జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్, స్థానిక శాసన సభ్యులు బోనెల విజయ చంద్రతో కలసి శనివారం ప్రారంభించారు.

Similar News

News November 24, 2025

చదరంగం నేర్పించే జీవిత పాఠం!

image

చదరంగం ఆట లైఫ్‌లో ఛాలెంజెస్‌ను ఎలా ఎదుర్కోవాలో చెబుతుంది. చెస్‌లో ఎదుటి వ్యక్తి తప్పు చేస్తాడని ఎదురుచూస్తే మనం గెలవలేం. లైఫ్‌లో కూడా అలా వేచి చూడకుండా మీ స్ట్రాటజీతో అవకాశాలను క్రియేట్ చేసుకోండి. 16 పావులూ మన వెంటే ఉన్నా.. ఆఖరి నిమిషంలో మన యుద్ధం మనమే చేయాలి. లైఫ్‌లో కూడా అంతే.. ఇతరులపై డిపెండ్ అవ్వకుండా మీకోసం మీరే పోరాడాలి. ఇబ్బందులు వచ్చినప్పుడే మన సామర్థ్యమేంటో బయట పడుతుంది.

News November 24, 2025

ఖమ్మంలో ఇందిరమ్మ ఇళ్లపై ధరల భారం

image

ఇందిరమ్మ ఇళ్ల పథకంతో సొంతిల్లు కట్టుకోవాలనుకున్న పేదలకు పెరిగిన ఇసుక, ఇటుక ధరలు గుదిబండగా మారాయి. ఖమ్మం జిల్లాలో ఇసుక రూ.8 వేల నుంచి రూ.12 వేలు, ఇటుక రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు విక్రయిస్తుండటంతో నిర్మాణం భారమైంది. ‘దేవుడు కరుణించినా, వ్యాపారులు కరుణించలేదు’అని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News November 24, 2025

మండపేటలో మంత్రి పర్యటన రద్దు

image

మంత్రి నాదెండ్ల మనోహర్ మండపేట పర్యటన రద్దయిందని ఏపీ ఐఐసీ ఛైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ తెలిపారు. మంత్రి మంగళవారం మండపేటలో సూర్య కన్వెన్షన్ హాల్లో రైతులతో ముఖాముఖి కార్యక్రమానికి పాల్గొనాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల కార్యక్రమం రద్దు చేశారు. మళ్లీ ఎప్పుడు ఉంటుందో త్వరలో చెప్తామన్నారు.