News March 16, 2025

PPM: మూడు అంబులెన్స్‌లను అందించిన NPCI

image

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పార్వతీపురం మన్యం జిల్లాకు మూడు అంబులెన్స్‌లను అందించారు. ఈ అంబులన్స్‌లను సాలూరులో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించగా, పార్వతీపురంలో కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్, స్థానిక శాసన సభ్యులు బోనెల విజయ చంద్రతో కలసి శనివారం ప్రారంభించారు.

Similar News

News February 9, 2026

జగిత్యాల: బీజేపీ నుంచి 11 మంది సస్పెండ్

image

జిల్లాలో పార్టీ నిబంధనలు ఉల్లంఘించిన 11 మందిని బీజేపీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ రవీందర్ విశ్వనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాలకు చెందిన సాంబారి కళావతి, అరవ లక్ష్మీ, ముధం రాము, రాపతి రాజు, కోక్కుల ధర్మేంద్ర, మెట్‌పల్లికి చెందిన మర్రి నందకిషోర్, ఆర్మూర్ ప్రశాంత్, బొండ్ల నరేశ్, కోరుట్లకు చెందిన ఇందూరి సత్యం, ఐలాపూర్ పద్మ, తోట రాజేషంలను సస్పెండ్ చేశారు.

News February 9, 2026

ASF జిల్లాలో రేపు, ఎళ్లుండి సెలవు

image

ఈ నెల 11న జరగనున్న ఆసిఫాబాద్, కాగజ్ నగర్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 10, 11న సెలవు ప్రకటించినట్లు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత తెలిపారు. పోలింగ్ నిర్వహణ కోసం ఉపయోగించే అన్ని ప్రభుత్వ భవనాలు, విద్యా సంస్థలు, ఇతర భవనాలకు రేపు, ఎళ్లుండి స్థానిక సెలవు దినంగా ప్రకటించారు. ఓటర్లు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.

News February 9, 2026

చిత్తూరు: ‘డ్రోన్ కెమెరా నుంచి తప్పించుకోలేరు’

image

కార్వేటినగరం పోలీసులు డ్రోన్ కెమెరా నిఘాతో మండలంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని సెకండ్ల వ్యవధిలో పట్టేస్తున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో సోమవారం సీఐ హనుమంతప్ప ఎస్ఐ తేజశ్వినితో కలిసి ధైర్యస్పర్శ కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్రోన్ కెమెరా నిఘా పర్యవేక్షణలో మందుబాబులను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి పట్టుబడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.