News April 17, 2025

PPM: మే 12వ తేదీ నుంచి సప్లమెంటరీ పరీక్షలు

image

ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలను మే 12వ తేదీ ప్రారంభం కానున్నట్లు డీఐఈఓ మంజుల వీణ తెలిపారు. ఇంటర్ పరీక్షల్లో తప్పిన విద్యార్థులు ఈ నెల 22 తేదీలోపు పరీక్ష పీజు చెల్లించేందుకు గడువు అని చెప్పారు. ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండ్ ఇయర్‌కి మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు నిర్వహించనున్నట్లు గురువారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. 

Similar News

News December 21, 2025

సిరిసిల్లలో 17,724 కేసులు పరిష్కారం

image

సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ 21 వరకు లోక్ అదాలత్‌లో 17,724 కేసులను పరిష్కరించామని సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సివిల్ 16, క్రిమినల్ 398, ఎక్సైజ్ 33, చెక్ బౌన్స్ 11, కుటుంబ తగాదాలు 01, గృహ హింస 6, భూ సేకరణ కేసులు 2, బ్యాంకు కేసులు 9, డ్రంక్ అండ్ డ్రైవ్ 1725, ట్రాఫిక్ చలానాలు 15,508, పెట్టి కేసులు 12 పరిష్కరించామన్నారు.

News December 21, 2025

ఒంగోలు: సామాన్యుడి ఒక్క ట్వీట్.. ఎంత పని చేసిందంటే?

image

ఒక సామాన్య వ్యక్తి చేసిన ఒక్క ట్వీట్, రైల్వే అధికారులు, ఆర్పీఎఫ్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఒంగోలు రైల్వేస్టేషన్ వద్ద గల పట్టాలపై ప్రయాణికులు దాటే పరిస్థితిని ఒకరు గమనించారు. రైలు వచ్చే క్రమంలో కూడా ప్రయాణికులు పట్టాలు దాటితే.. ఎంత ప్రమాదమో. ఒక ప్రయాణికుడు ఈ విషయాన్ని ఇండియన్ రైల్వేకు ట్వీట్ ద్వారా తెలిపాడు. ఇక అంతే ఉన్నతాధికారుల ఆదేశాలతో అధికారులు తనిఖీ చేసి నిన్న 10 మందిపై కేసులు నమోదు చేశారు.

News December 21, 2025

ఎయిమ్స్‌ న్యూరాలజీలో సూర్యాపేట యువతి ప్రతిభ

image

సూర్యాపేటకి చెందిన డాక్టర్ వూర నీతు శ్రీ జాతీయ స్థాయిలో సత్తా చాటారు. ఎయిమ్స్ (AIIMS) నిర్వహించిన డి.ఎం న్యూరాలజీ ప్రవేశ పరీక్షలో ఆల్ ఇండియా 34వ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా ఆమె తండ్రి డాక్టర్ రామ్మూర్తి యాదవ్ మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో నీతు శ్రీ కష్టపడి ఈ ఘనత సాధించడం గర్వంగా ఉందన్నారు. ఆమె ప్రతిభను పలువురు ప్రముఖులు అభినందించారు.