News February 2, 2025
PPM: రూ. 3 కోట్లతో జిల్లా ఆసుపత్రిలో మరమ్మతు పనులు

పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో రూ.3 కోట్లతో మరమ్మతు పనులను చేపడుతున్నట్లు ఏపీ ఎంఎస్ఐడీసీ కార్యనిర్వాహక ఇంజినీర్ ఎం.శ్రీనివాసమూర్తి తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పనుల్లో భాగంగా ఆసుపత్రి ముందు రహదారి, మేనహోల్స్, విద్యుత్ పనులు, ఆసుపత్రి కాంపౌండ్‌లోని కాలువల నిర్మాణం చేయాల్సి ఉందన్నారు. వారం రోజుల్లో ఈ పనులు ప్రారంభించనున్నట్లు ఆయన ఆ ప్రకటనలో వివరించారు.
Similar News
News February 19, 2025
తెలుగు రాష్ట్రాలకు నిధులు రిలీజ్ చేసిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాలకు విపత్తు, వరదల సాయం కింద నిధులు విడుదల చేసింది. ఏపీకి అత్యధికంగా రూ.608.08 కోట్లు, తెలంగాణకు రూ.231 కోట్లు, త్రిపురకు రూ.288.93 కోట్లు, ఒడిశాకు రూ.255.24 కోట్లు, నాగాలాండ్‌కు రూ.170.99 కోట్లు రిలీజ్ చేసింది. ఐదు రాష్ట్రాలకు కలిపి రూ.1,554.99 కోట్లు విడుదల చేశారు.
News February 19, 2025
సలామ్ DIIs: 45 రోజుల్లోనే రూ.లక్ష కోట్ల పెట్టుబడి

స్వదేశీ సంస్థాగత మదుపరులు (DII) భారత స్టాక్ మార్కెట్లకు ఆపద్బాంధవులుగా మారారు. FM నిర్మలా సీతారామన్ చెప్పినట్టుగానే రిటైల్ ఇన్వెస్టర్లతో కలిసి FIIల పెట్టుబడుల ఉపసంహరణను పూర్తిగా అబ్జార్బ్ చేసుకుంటున్నారు. 2025లో 45 రోజుల్లోనే రూ.1.2లక్షల కోట్లను ఈక్విటీల్లో కుమ్మరించారు. FIIలు వెనక్కి తీసుకున్న రూ.1.6 లక్షల కోట్లతో ఇది దాదాపుగా సమానం. 2024లోనూ DIIలు రూ.5.22 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడం విశేషం.
News February 19, 2025
శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు.. ముఖ్యమైన అంశాలు!

● శ్రీశైలంలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
● అన్ని ఆర్జిత సేవలు రద్దు.. ప్రముఖులకు 4విడతలుగా బ్రేక్ దర్శనం
● 22న టీటీడీ తరఫున స్వామి, అమ్మవార్లకు వస్త్రాల అందజేత
● 23న సీఎం చంద్రబాబు పట్టువస్త్రాల సమర్పణ
● కాలినడక భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి
● శివరాత్రి రోజున ప్రభోత్సవం, పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కళ్యాణం
● భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం
● ఘాట్‌లో 24గంటల అనుమతి
● 453 స్పెషల్ బస్సులు ఏర్పాటు