News April 2, 2025
PPM: రెవెన్యూ సదస్సుల్లో 99.34 శాతం పూర్తి

జిల్లాలో 6,246 రెవెన్యూ సదస్సులకు గాను 6,205 సదస్సులను చేపట్టి 99.34 శాతం మేర పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అడిషనల్ సీసీఎల్ఎకు వివరించారు. రెవెన్యూ సదస్సులు, పీజీఆర్ఎస్, రెగ్యులరైజేషన్, నీటి పన్ను తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో అడిషనల్ సీసీఎల్ఎ, సెక్రటరీ డా. ఎన్.ప్రభాకరరెడ్ది బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాల వారీగా ప్రగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Similar News
News April 10, 2025
చిత్తూరు-కాట్పాడి డబుల్ లైన్‌కు గ్రీన్ సిగ్నల్

తిరుపతి-కాట్పాడి డబుల్ లైన్ నిర్మాణానికి రూ.1332 కోట్లతో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు బీజేపీ సీనియర్ నాయకుడు చిట్టిబాబు వెల్లడించారు. తిరుపతి-పాకాల, చిత్తూరు-కాట్పాడి వరకు సింగిల్ లైనే ఉంది. 104 కిలోమీటర్ల మేర ఉన్న ఈ మార్గాన్ని డబుల్ లైన్‌గా మార్చనున్నారన్నారు. ఈ పనులు పూర్తి అయితే శ్రీకాళహస్తి-చెన్నై మార్గంలో బెల్లం, గ్రానైట్, మామిడి ఎగుమతులు పెరుగుతాయి.
News April 10, 2025
ఇస్రోకు ఎంపికైన పల్నాడు విద్యార్థి

పల్నాడు జిల్లా విజయపురి సౌత్‌లోని జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థి వెంకట నాగరాజు ఇస్రో యువికా-2025 కార్యక్రమానికి ఎంపికయ్యాడు. బుధవారం జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు నాగరాజును సన్మానించి అభినందించారు. రాష్ట్రం నుంచి పదిమంది విద్యార్థులు ఇస్రోకు ఎంపిక కాగా, అందులో పల్నాడు జిల్లాకు చెందిన విద్యార్థి ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు.
News April 10, 2025
కొత్తపల్లి: బెట్టింగ్‌లో నష్టం రావడంతో యువకుడి ఆత్మహత్యాయత్నం

బెట్టింగ్ యాప్‌లో నష్టం రావడంతో యూ.కొత్తపల్లి(M) రామన్నపాలెంలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన సూరిబాబు ఓ షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలని గేమ్ ఆడి రూ.కోటి 50లక్షలు పోగొట్టుకున్నాడు. అప్పులవడంతో మంగళవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేయగా కుటుంబీకులు కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.