News April 2, 2025
PPM: రెవెన్యూ సదస్సుల్లో 99.34 శాతం పూర్తి

జిల్లాలో 6,246 రెవెన్యూ సదస్సులకు గాను 6,205 సదస్సులను చేపట్టి 99.34 శాతం మేర పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అడిషనల్ సీసీఎల్ఎకు వివరించారు. రెవెన్యూ సదస్సులు, పీజీఆర్ఎస్, రెగ్యులరైజేషన్, నీటి పన్ను తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో అడిషనల్ సీసీఎల్ఎ, సెక్రటరీ డా. ఎన్.ప్రభాకరరెడ్ది బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాల వారీగా ప్రగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Similar News
News April 18, 2025
అన్నమయ్య : ఏకకాలంలో తనిఖీలు

సంఘ విద్రోహక చర్యలను అరికట్టేందుకు అన్నమయ్య జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఏక కాలంలో వాహనాలను తనిఖీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో గురువారం రాత్రి జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది సోదాలు చేశారు. రాత్రి 9 నుంచి ఆటో, బైక్ కార్, లారీ, బస్సుల పరిశీలుంచారు. ముఖ్యమైన ప్రదేశాలు, రహదారుల్లో పికెట్ ఏర్పాటు చేశారు.
News April 18, 2025
తిరుమలలో కారు దగ్ధం.. భక్తులు సురక్షితం

తిరుమలలో ప్రమాదం తప్పింది. ఒంగోలుకు చెందిన భక్తులు కారులో తిరుమలకు వచ్చారు. కొండపై ఉన్న కౌస్తుభం పార్కింగ్ ప్రాంతంలో నిలిపారు. కారులో అకస్మాత్తుగా పొగలు రావడంతో వెంటనే భక్తులు దిగేశారు. తర్వాత కొద్దిసేపటికే కారులో మంటలు చెలరేగాయి. వాహనం మొత్తం కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
News April 18, 2025
అనాసాగరం వద్ద ప్రమాదం.. ఇద్దరి మృతి

నందిగామ పరిధిలోని అనాసాగరం హైవే ఫ్లైఓవర్ వద్ద గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేదాద్రి నుంచి కాలిబాటన గుణదల చర్చికి వెళ్తున్న పసుమర్తి భాస్కరరావు, రుద్రపోగు వెంకటేశ్వర్లును లారీ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.