News February 6, 2025
PPM: వీడీవీకెలను బలోపేతం చేయాలి- కలెక్టర్
మన్యం జిల్లాలో ప్రధానమంత్రి వన్ ధన్ వికాస కేంద్రాల (వీడీవీకే) కార్యకలాపాలను మెరుగుపరిచేందుకు అన్ని చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా గురువారం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, గిరిజన సహకార కార్పొరేషన్ (జీసీసీ) మేనేజింగ్ డైరెక్టర్ కల్పనా కుమారి పార్వతీపురం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 68, సీతంపేట ఐటీడీఏ పరిధిలో దాదాపు 54 వీడీవీకెలు ఉన్నాయి.
Similar News
News February 7, 2025
కోటగిరి: తల్లి, తనయుడు అదృశ్యం
కోటగిరి మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన బండారి జ్యోతి(24) తన ఒకటిన్నర సంవత్సరాల కొడుకుతో అదృశ్యమైనట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. ఈ నెల 5వ తేదీన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బిడ్డతోపాటు వెళ్లిపోయింది. జ్యోతికి మాటలు రావని ఆచూకీ తెలిసినవారు కోటగిరి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
News February 7, 2025
MNCL: రిక్రూట్మెంట్ ఫౌండేషన్ కోర్సులకు ఉచిత శిక్షణ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డిగ్రీ ఉత్తీర్ణులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులకు రిక్రూట్మెంట్ ఫౌండేషన్ కోర్సులకు ఉచిత అందించనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి పురుషోత్తం తెలిపారు. ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే 4 నెలల ఉచిత శిక్షణలో అభ్యర్థులకు బుక్ ఫండ్, ప్రతి నెల స్టైఫండ్ ఇస్తామన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 9 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News February 7, 2025
క్రీడాకారులకు రూ.7.96 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల
AP: రాష్ట్ర క్రీడాకారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 189 మందికి రూ.7.96 కోట్ల ప్రోత్సాహాలను విడుదల చేసింది. వైసీపీ ప్రభుత్వం 224 మందికి రూ.11.68 కోట్ల ఇన్‌సెంటీవ్‌లను పెండింగ్‌లో పెట్టిందని శాప్ ఛైర్మన్ రవినాయుడు ఆరోపించారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో రూ.7.96 కోట్లను రిలీజ్ చేశారని తెలిపారు.