News February 6, 2025
PPM: వీడీవీకెలను బలోపేతం చేయాలి- కలెక్టర్

మన్యం జిల్లాలో ప్రధానమంత్రి వన్ ధన్ వికాస కేంద్రాల (వీడీవీకే) కార్యకలాపాలను మెరుగుపరిచేందుకు అన్ని చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా గురువారం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, గిరిజన సహకార కార్పొరేషన్ (జీసీసీ) మేనేజింగ్ డైరెక్టర్ కల్పనా కుమారి పార్వతీపురం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 68, సీతంపేట ఐటీడీఏ పరిధిలో దాదాపు 54 వీడీవీకెలు ఉన్నాయి.
Similar News
News February 10, 2026
ఖమ్మం: తెలంగాణ పోరాట యోధురాలు మృతి

తెలంగాణ పోరాట యోధురాలు గండూరి నర్సు బాయమ్మ మరణించారు. ఖమ్మం పరిధి మామిండ్ల గూడెంలో నివాసం ఉంటున్న ఆమె అనారోగ్యంతో మృతిచెందారు. కాగా ఆమె భర్త, సీపీఎం నేత గండ్లూరి కిషన్‌రావు 1976లో మామిండ్లగూడెంలోని తన ఇంటి సమీపంలోనే హత్యకు గురయ్యారు. ఆమె గతంలో ముదిగొండ మండలం బాణాపురం సర్పంచ్‌గా పని చేశారు. నర్సు బాయమ్మ మరణ వార్త విన్న పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.
News February 10, 2026
అనకాపల్లి టీడీపీలో ముదురుతున్న పెట్రోల్ బంక్ రాజకీయం

అనకాపల్లిలో డీసీఎంఎస్ స్థలంలో ఏర్పాటు చేస్తున్న పెట్రోల్ బంక్ టీడీపీలో రాజకీయ దుమారం రేపుతోంది. డీసీఎంఎస్ ఛైర్మన్‌గా టీడీపీకి చెందిన కోట్ని బాలాజీ బాధ్యతలు తీసుకున్న తరువాత పెట్రోల్ బంక్ పనులు జరుగుతున్న సమయంలో గత శనివారం మాజీ మంత్రి డీవీఆర్ తనయుడు రత్నాకర్ హైరానా చేసినట్లు సమాచారం. దీంతో ఈ సమస్యను పార్టీలోని ఇరువర్గాలు మంత్రి లోకేశ్ దృష్టికి వెళ్లినట్లు పార్టీ పెద్దలు పేర్కొన్నారు.
News February 10, 2026
టీనేజ్ ప్రెగ్నెన్సీలో ‘రెడ్ జోన్’లో అనంతపురం

అనంతపురం జిల్లాలో టీనేజ్ ప్రెగ్నెన్సీ శాతం 12కుపైగా నమోదు కావడంపై సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. ఈ విషయంలో జిల్లా రెడ్ జోన్‌లో ఉన్నట్లు స్పష్టమైందని పేర్కొన్నారు. గత ఏడాది జిల్లాలో 1,500 మందికి పైగా టీనేజర్లు గర్భం దాల్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీనిపై అవగాహన పెంచి, బాల్య వివాహాలను అరికట్టాలని సీఎం ఆదేశించారు.


