News March 28, 2025
PPM: ‘శ్రీ విశ్వావసు ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించాలి’

జిల్లాలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలను సంప్రదాయ రీతిలో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఉగాది వేడుకల ఏర్పాట్లపై సంబంధిత శాఖాధికారులతో సమీక్షా సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో స్థానిక లయన్స్ కళ్యాణ మండపం వేదికగా ఈనెల 30వ తేదీన ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు.
Similar News
News October 24, 2025
ఉపాధ్యాయులను ఇంటర్వ్యూ చేసిన కలెక్టర్

విదేశీ విద్యా విధానం ఆధ్యయానికి దరఖాస్తులు చేసుకున్న ఉపాధ్యాయులకు శుక్రవారం కలెక్టర్ అభిలాష అభినవ్ ఇంటర్వ్యూ నిర్వహించారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు జిల్లాలోని ఉపాధ్యాయులను విదేశీ విద్యా విధానాలు పరిశీలించేందుకు ఆసక్తి గల ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యా విధానాన్ని అధ్యయనం చేసి ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు కార్యక్రమం చేపడుతున్నామన్నారు.
News October 24, 2025
గుర్తింపు ఫీజు, హరిత నిధి చెల్లించాలి: డీఐఈఓ

జిల్లాలోని ప్రభుత్వ రంగ, ప్రైవేటు జూనియర్ కళాశాలలు గుర్తింపు ఫీజు చెల్లించాలని DIEO శ్రీధర్ సుమన్ అన్నారు. ఇంటర్ బోర్డు వెబ్ సైట్‌లో సంబంధిత కాలేజ్ లాగిన్ ద్వారా “రికగ్నైజేషన్ ఫీజు” తప్పక చెల్లించాలని, విద్యార్థుల పూర్తి వివరాలను “ఆన్ లైన్ చెక్ లిస్టు”లతో సరి చూసుకోవాలని DIEO సూచించారు.
News October 24, 2025
ములుగు: జిల్లా స్థాయి యువజన పోటీల నిర్వహణ

జిల్లాలోని యువతకు జిల్లా స్థాయి యువజన పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడల అధికారి సర్దార్ సింగ్ తెలిపారు. ఇన్నోవేషన్ (సైన్స్ మేళా ప్రదర్శన) జానపద నృత్యం, జానపద గీతం, కవిత్వ రచన, కథారచన, పెయింటింగ్ విభాగాల్లో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. 15 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వయసు గలవారు పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు. ఈ నెల 28న జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్‌లో నిర్వహిస్తామన్నారు.


