News February 14, 2025
PPM: సంజీవయ్య ప్రేరణతో ముందుకు సాగాలి

దామోదరం సంజీవయ్య స్పూర్తి, ప్రేరణతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. దామోదరం సంజీవయ్య జయంతిని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని దామోదరం సంజీవయ్య చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి, పూలమాలను వేసి నివాళులర్పించారు.
Similar News
News December 5, 2025
నెల్లూరు: భారీ వర్షాలకు ఒకరు మృతి.. మరొకరు గల్లంతు..

నెల్లూరు ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. నెల్లూరు పొర్లుకట్ట ప్రాంతానికి చెందిన ఇంటర్ విద్యార్థి మస్తాన్ గురువారం పొట్టెపాలెం కలుజులో పడి మృతి చెందాడు. నెల్లూరు శివారు ప్రాంతం కొండ్లపూడికి చెందిన రవికుమార్ బుధవారం సాయంత్రం నెల్లూరు కాలువలో గల్లంతయ్యారని సమాచారం. తండ్రి గల్లంతైనట్లు రవికుమార్ కుమార్తె కావ్య గురువారం నెల్లూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News December 5, 2025
జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

<
News December 5, 2025
పల్లె టు కాశ్మీర్.. సరిహద్దులో కొండంరాజుపల్లి బిడ్డ

సిద్దిపేట జిల్లా కొండంరాజపల్లి గ్రామానికి బండి లక్ష్మి- తిరుపతి దంపతుల కుమారుడు బండి శ్రీనివాస్ అగ్నివీర్ పథకంలో దేశసేవకు అంకితమయ్యాడు. బెంగళూరులో ఆరు నెలల కఠోర శిక్షణను పూర్తి చేసిన శ్రీనివాస్ కల ఉద్యోగ పట్టాను అందుకున్నాడు. అతని పట్టుదలతో కాశ్మీర్లో దేశ సేవలకు వెళ్తున్నాడు. ఈ విజయం పట్ల స్వగ్రామంలో ఆనందం నెలకొంది.


