News March 21, 2025

PPM: సీపీహెచ్సీలకు సూచనలు చేసిన డీఎంహెచ్ఓ

image

సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ (CPHC) శిక్షణ ద్వారా నేర్చుకున్న నైపుణ్యంతో గ్రామీణ స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందజేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు సూచించారు. స్టాఫ్ నర్స్,ఏఎన్ఎం లకు సిపిహెచ్సి శిక్షణా కార్యక్రమాన్ని బ్యాచ్‌ల వారీగా నిర్వహించారు. ఈ మేరకు ఎన్జీఓ హోమ్‌లో శుక్రవారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో డీఎంహెచ్ఓ మాట్లాడారు.

Similar News

News December 6, 2025

రాజమండ్రి: విద్యార్థులకు ముఖ్య గమనిక

image

నన్నయ విశ్వవిద్యాలయం రాజమండ్రి, కాకినాడ, తాడేపల్లిగూడెం క్యాంపస్‌లలోని పీజీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్స్ ఈ నెల 8 నుండి 12వ తేదీ వరకు రాజమండ్రి క్యాంపస్‌లో నిర్వహిస్తున్నామని వీసీ ఎస్. ప్రసన్నశ్రీ తెలిపారు. శనివారం వర్సిటీలో ఈ వివరాలు వెల్లడించారు. ఎం.ఏ., ఎం.కామ్, ఎం.పీ.ఈడీ, ఎంఎస్సీ ప్రోగ్రామ్స్‌కు ఈ అడ్మిషన్స్ ఉంటాయని వీసీ పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

News December 6, 2025

రీఫండ్ సరే.. మిస్ అయిన వాటి సంగతేంటి?

image

తల్లి మరణించినా వెళ్లలేని దుస్థితి.. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్‌ మిస్సైన టీమ్.. విదేశాల్లో జాబ్‌కు వెళ్తూ నిలిచిపోయిన యువకులు.. ప్రయాణాలు వాయిదా పడడంతో నష్టపోయిన కుటుంబాలు.. ఎయిర్‌పోర్టుల్లో వెయిట్ చేసి అనారోగ్యం బారినపడ్డ వృద్ధులు.. ఇలా ఎయిర్‌పోర్ట్‌ల్లో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. టికెట్ డబ్బులు రీఫండ్ చేస్తున్న ఇండిగో తాము కోల్పోయిన వాటిని తీసుకురాగలదా అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.

News December 6, 2025

10 లోపు సంతకాల సేకరణ పూర్తి చేయాలి: చెల్లుబోయిన

image

కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేసి ఈ నెల 10వ తేదీన జిల్లా పార్టీ కార్యాలయానికి అందజేయాలని జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ ఆదేశించారు. అనంతరం 13వ తేదీన వాటిని కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపనున్నట్లు ఆయన తెలిపారు. బొమ్మూరు పార్టీ కార్యాలయం నుంచి జిల్లా పరిశీలకులు తిప్పల గురుమూర్తి అధ్యక్షతన శనివారం నిర్వహించిన గూగుల్ మీట్ సమావేశంలో ఆయన ఈ విషయం చెప్పారు.