News January 26, 2025
PPM: స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు సన్మానం

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గణతంత్ర దినోత్సవ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ చేతుల మీదుగా ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా స్వతంత్ర సమరయోధులు పాలూరు సాంబమూర్తి కుమార్తె పాలూరు భారతిని కలెక్టర్ సన్మానించారు.
Similar News
News December 10, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓ నేటితో జిల్లాలో ముగిసిన తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం
✓ ఎన్నికల సిబ్బంది రేపు రిపోర్ట్ చేయాలి: కలెక్టర్
✓ భద్రాచలంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్
✓ ముక్కోటి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం: కలెక్టర్
✓ గుండాల: యువతిని మోసం చేసిన నిందితుడికి 10 ఏళ్ల జైలు
✓ ఎన్నికలకు 1700 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు: ఎస్పీ
✓ అన్నపురెడ్డిపల్లి: ఎన్నికల నియమావళి తప్పనిసరిగా పాటించాలి: డీఎస్పీ
News December 10, 2025
ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలి: కలెక్టర్

ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. పౌర సరఫరా సంస్థ అధికారులతో మంగళవారం ఆయన సమావేశమై మాట్లాడారు. ధాన్యం అధికంగా కొనుగోలు చేసిన రైతు సేవా కేంద్రం సహాయకునికి, పౌరసరఫరాల ఉపతహశీల్దార్, తహశీల్దార్లకు అవార్డులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ అవార్డులను జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఇస్తామన్నారు.
News December 10, 2025
బుమ్రా అరుదైన రికార్డు.. తొలి భారత బౌలర్గా

టీమ్ ఇండియా దిగ్గజ పేసర్ జస్ప్రిత్ బుమ్రా అరుదైన రికార్డు నమోదు చేశారు. SAతో జరిగిన తొలి టీ20లో బ్రెవిస్ని ఔట్ చేసి 100 వికెట్స్ క్లబ్లో చేరారు. భారత్ తరఫున అర్ష్దీప్ తర్వాత ఈ ఘనత సాధించింది బుమ్రానే కావడం విశేషం. అలాగే అన్ని ఫార్మాట్లలో వంద వికెట్లు తీసిన తొలి ఇండియన్ బౌలర్గా అరుదైన రికార్డు నెలకొల్పారు. బుమ్రా కంటే ముందు లసిత్ మలింగ, టిమ్ సౌథీ, షకీబ్ అల్ హసన్, షాహీన్ అఫ్రిది ఉన్నారు.


