News December 12, 2025
PPM: ‘ఇంటి వద్దకే గ్యాస్ సిలిండర్లను ఉచితంగా డెలివరీ చేయాలి’

జిల్లాలోని వినియోగదారుల ఇంటి వద్దకే గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేయాలని జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి గ్యాస్ ఏజెన్సీ డీలర్లకు స్పష్టం చేశారు. గ్యాస్ డెలివరీని ఉచితంగా చేయాల్సి ఉన్నప్పటికీ, ఛార్జీలను వసూలు చేస్తే ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. అటువంటి డీలర్లు ఉంటే పద్ధతులు మార్చుకోవాలని, లేదంటే లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్లో గ్యాస్ ఏజెన్సీ డీలర్లతో సమీక్షించారు.
Similar News
News December 16, 2025
‘కొండగట్టు అంజన్న’కు అటవీ శాఖ నోటీసులు

TG: ‘కొండగట్టు ఆంజనేయ స్వామి’ గుడికి అటవీశాఖ నోటీసులివ్వడం వివాదంగా మారింది. ఇక్కడి 6 ఎకరాలు తమవని, భవనాలు, ఇతర నిర్మాణాలను కూల్చే అధికారం తమకుందని అందులో పేర్కొంది. కాగా వేద పాఠశాల, వసతి, భోజనశాల అన్నదాన సత్రం, పబ్లిక్ టాయిలెట్స్, వాటర్ ప్లాంట్ ఇక్కడే ఉన్నాయి. వాహన పూజలు, గిరి ప్రదక్షిణ దీనిలో సాగుతుంటాయి. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని సమస్య పరిష్కరించాలని BJP చీఫ్ రాంచందర్ రావు పేర్కొన్నారు.
News December 16, 2025
BHPL: మూడో విడత ‘ఖరీదైన‘ పంచాయతీ ఎన్నికలు!

జిల్లాలో మూడో విడత 78 పంచాయతీలలో ఎన్నికలు జరుగుతున్నాయి. అభ్యర్థుల ఖర్చు తడిసి ముద్దవుతోంది. ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి ప్రారంభమైన ఖర్చు నామినేషన్ల తర్వాత ఖర్చు లక్షల్లోకి పెరిగింది. నాలుగు మండలాల్లో పోలింగ్ బుధవారం జరుగుతోంది. పంచాయతీల్లో డబ్బు మద్యం ఏరులై పారుతోంది. కాళేశ్వరం, కాటారం, మహాదేవపుర్, గంగారం, మహాముత్తారం, శంకరంపల్లి ఆదివారంపేట, సూరారం, ధన్వాడ గ్రామాలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి.
News December 16, 2025
ములుగు: 2 నెలల క్రితమే జిల్లాలోకి దామోదర్ టీం!

మావోయిస్టు నేత బడే దామోదర్‌ను పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే రెండు నెలల క్రితమే దామోదర్‌తో పాటు ఆయన క్యాడర్ ములుగు జిల్లాకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో నిర్బంధం పెరగడం, ప్రస్తుతం తెలంగాణలో కాల్పుల విరమణ ఉండడడంతో సేఫ్ జోన్‌గా భావించినట్లు సమాచారం. కాగా, జిల్లాలో ఇటీవల ఎన్‌కౌంటర్ జరిగిన అటవీ ప్రాంతంలో షెల్టర్ తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది.


