News January 26, 2025

PPM: గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం

image

ఆదివారం స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో జరగబోయే 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. వేదికతో పాటు ఆవరణ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఆదివారం ఉదయం 9కి ముఖ్యఅతిథి జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ చే జాతీయ పతాక ఆవిష్కరణతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. పోలీసుల కవాతు, మార్చ్‌ ఫాస్ట్‌ తదుపరి జిల్లా ప్రజలను ఉద్దేశించి కలెక్టర్‌ సందేశం చదివి వినిపిస్తారు.

Similar News

News September 13, 2025

పటాన్‌చెరు: దేవుడు స్థలాన్ని చూపించాడని మిస్సింగ్

image

యువకుడు అదృశ్యమైన ఘటన పటాన్‌చెరులో చోటు చేసుకుంది. ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఇందిరమ్మ కాలనీకి చెందిన వీరేశ్ (22) గురువారం డ్యూటీకి వెళ్తున్నానని వెళ్లి తిరిగి రాలేదు. ‘నాకు కలలో దేవుడు ఒక స్థలాన్ని చూపించాడు అక్కడికి వెళ్తున్నాను’ అని అన్నకు మెసేజ్ పెట్టాడు. వెంటనే ఫోన్ చేయగా స్విచ్‌ఆఫ్ వచ్చింది. తమ్ముడి మిస్సింగ్ పై అన్న పటాన్‌చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News September 13, 2025

MLA సంజయ్‌కు ఇంటిపోరు.. మళ్లీ ‘గేర్’ మారుస్తారా?

image

పార్టీ ఫిరాయింపు నోటీసుపై BRSలోనే ఉన్నట్లు JGTL MLA సంజయ్ స్పీకర్‌కు వివరణ ఇవ్వడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. అలాగే స్థానికంగా తనది ఏ పార్టీనో చెప్పుకోలేని సంకట స్థితిలో MLA ఉన్నారు. కాగా, ఎవరి పార్టీలో వారుంటే మంచిదే కదా అంటూ ఇప్పటికే మాజీమంత్రి జీవన్ రెడ్డి సంజయ్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అయితే సంజయ్‌కు ఇంటిపోరు ఎక్కువవ్వడంతో CONGలో ఉంటారా? BRSలోకి వెళ్తారా? అన్న చర్చ జరుగుతోంది.

News September 13, 2025

కరీంనగర్: కానరాని బొడ్డెమ్మ పండుగ..!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బతుకమ్మ పండుగకు తొమ్మిది రోజుల ముందు గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభమయ్యే బొడ్డెమ్మ వేడుక కనుమరుగయిపోయింది. కాగా, భాద్రపద బహుళ పంచమి నుంచి ఈ బొడ్డెమ్మ పండుగ మొదలవుతుంది. గ్రామాల్లో బతుకమ్మ పండుగకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో బొడ్డెమ్మ పండుగకు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తారు. ప్రస్తుతం పట్టణాల్లో అక్కడక్కడ కనిపిస్తున్న బొడ్డెమ్మ వేడుకలు గ్రామాల్లో మాత్రం కనిపించడం లేదు.