News March 19, 2025
PPM: ‘గృహ నిర్మాణాలు వేగవంతం కావాలి’

పార్వతీపురం జిల్లాలో అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాల పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం గృహ నిర్మాణ సంస్థ ఇంజినీరింగ్ అధికారులు, మండల ప్రత్యేక, మండలస్థాయి తదితర అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వర్ణ ఆంధ్రా 2047 విజన్‌లో భాగంగా 2029 నాటికి అందరికీ సొంత ఇళ్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
Similar News
News January 7, 2026
పాలమూరు: ‘నో హెల్మెట్.. నో ఫ్యూయల్’

“నో హెల్మెట్ – నో ఫ్యూయల్” అనే నినాదంతో అన్ని పెట్రోల్ బంకుల్లో స్పష్టమైన బోర్డులు ఏర్పాటు చేయాలని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ భగవంత్ రెడ్డి తెలిపారు. హెల్మెట్ లేకుండా వచ్చిన ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ పోయరాదని పెట్రోల్ బంక్ యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి పౌరుని బాధ్యత అని, ప్రజల భద్రత దృష్ట్యా పెట్రోల్ బంక్ యజమానులు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.
News January 7, 2026
రీ- సర్వే పక్కాగా జరగాలి: బాపట్ల కలెక్టర్

రీ- సర్వే పక్కాగా జరగాలని, అప్పుడే భూ సమస్యలు పరిష్కారం అవుతాయని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. బాపట్ల కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రెవెన్యూ రికార్డులన్నీ ఆన్‌లైన్లో రికార్డు చేయాలని సూచించారు. ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు రెవెన్యూ సమస్యలపై సమీక్ష ఉంటుందని తెలిపారు.
News January 7, 2026
మేడారం జాతరకు కేసీఆర్‌ను ఆహ్వానించనున్న ప్రభుత్వం!

TG: మేడారం మహా జాతరకు రావాలంటూ మాజీ సీఎం కేసీఆర్‌ను ప్రభుత్వం ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. మంత్రి సీతక్క ఇవాళ ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లి ఆయనకు ఆహ్వానపత్రిక అందజేయనున్నట్లు సమాచారం. అటు జాతరకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రావాలని సీతక్క కోరారు. నిన్న అసెంబ్లీ వద్ద వారికి ఇన్విటేషన్లు ఇచ్చారు. కాగా ఈ నెల 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానుంది.


