News February 16, 2025
PPM: చెత్త నుంచి సంపద సృష్టిపై సమావేశం

పార్వతీపురం జిల్లాలో గృహాల నుంచి సేకరిస్తున్న చెత్త నుంచి సంపద సృష్టిపై దృష్టి సారించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. తడి, పొడి చెత్తలను వేరు చేసి వర్మి కంపోస్టులతో సంపద సృష్టించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈఓపీఆర్డీలు, పంచాయతీ సెక్రటరీలు బాధ్యత చేపట్టాలన్నారు. శనివారం స్వచ్ఛ దివాస్, ఎంఎస్ఎంఈల సర్వేపై కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Similar News
News February 22, 2026
రోజుకు 50 మెట్లు ఎక్కితే.. గుండె జబ్బులకు చెక్!

ఆఫీసులలో గంటల తరబడి కూర్చునే వారికి మెట్లెక్కడం ఒక మంచి ఎక్సర్‌సైజ్. రోజుకు కనీసం 50 మెట్లు ఎక్కితే గుండె జబ్బుల రిస్క్ 20% తగ్గుతుందని స్టడీస్ చెబుతున్నాయి. ఇది గుండె పంపింగ్ సామర్థ్యాన్ని వేగంగా పెంచుతుంది. మరోవైపు వేగంగా నడిస్తే మెటబాలిజం మెరుగుపడి డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంటుంది. మెట్లెక్కడం కీళ్లపై ఒత్తిడి పెంచుతుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారు నడవడం బెటర్. టైమ్ తక్కువున్నప్పుడు మెట్లెక్కాలి.
News February 22, 2026
సీసీ కెమెరాల నిఘా పెంచాలి: ఎస్పీ

రంజాన్ మాసం నేపథ్యంలో నంద్యాలలో సీసీ కెమెరాలు నిఘా మరింత పెంచాలని ఎస్పీ సునీల్ షోరాణ్ పోలీసులకు సూచించారు. శనివారం విజిబుల్ పోలింగ్‌లో భాగంగా నంద్యాలలోని పలు ప్రాంతాలలో ఆయన పర్యటించారు. బొమ్మలసత్రం, ఆర్టీసీ బస్టాండ్, భైర్మల్ విధి, శ్రీనివాస సెంటర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
News February 22, 2026
ఆముదపు విత్తులు ముత్యాలవుతాయా?

ఒక వస్తువు లేదా వ్యక్తి సహజ స్వభావం ఎప్పటికీ మారదు. ఆముదపు విత్తనాలు ఎప్పటికీ ఆముదపు విత్తనాలుగానే ఉంటాయి, అవి విలువైన ముత్యాలుగా మారవు. అలాగే దుర్మార్గులైన లేదా చెడ్డ స్వభావం కలిగిన వ్యక్తులు వారి ప్రవర్తనను మార్చుకోరని చెప్పడానికి.. సహజంగా జరగని లేదా అసాధ్యమైన విషయాల గురించి మాట్లాడేటప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.


