News February 19, 2025

PPM: డీఐఈఓకు ఆచార్య దేవోభవ అవార్డు

image

పార్వతీపురం జిల్లా ఇంటర్మీడియట్ విద్యా శాఖ అధికారి డి.మంజుల వీణ‌కు ఆచార్య దేవోభవ అవార్డు లభించింది. గణిత శాస్త్ర అధ్యాపకురాలుగా, ఉమ్మడి జిల్లాల ఆర్‌ఐ‌ఓగా, పార్వతీపురం జిల్లా ఇంటర్మీడియట్ విద్యా శాఖ అధికారిగా సేవలు అందించారు. ఈ మేరకు ప్రియదర్శిని సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్  2025 ఏడాదికి ఈ అవార్డును అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ మంజుల వీణను బుధవారం అభినందించారు.

Similar News

News December 14, 2025

ఇవాళ ఉదయం 8 గంటల నుంచి అడ్వాన్స్ బుకింగ్స్

image

సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు SCR ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇవాళ ఉదయం 8 గంటల నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కానున్నాయి. ఈ రైళ్లలో ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా బుక్ చేసుకోవాలని రైల్వే శాఖ పేర్కొంది. రద్దీ నేపథ్యంలో జనవరి 8-20 వరకు 41 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. కాగా బుకింగ్స్ నిమిషాల్లోనే పూర్తయ్యే అవకాశం ఉంది.

News December 14, 2025

ఏకాగ్రతకు చిహ్నం ‘కుంకుమ’

image

కుంకుమను పసుపు, సున్నపు రాయి కలిపి తయారుచేస్తారు. అయితే ఇప్పుడు ఆ ప్రక్రియ చాలావరకు మారిపోయింది. రసాయనాలు వాడుతున్నారు. అలా తయారైన కుంకుమనే మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. అయితే అసలైన కుంకుమ ధరించడం ఎంతో ముఖ్యమని చెబుతున్నారు పండితులు. కనుబొమ్మల నడుమ కుంకుమధారన మనలో ఏకాగ్రతను పెంచుతుందని అంటున్నారు. కుదిరితే ఇంట్లోనే కుంకుమ తయారు చేసుకోవాలని సూచిస్తున్నారు.

News December 14, 2025

మరికాసేపట్లో..

image

TG: ఇవాళ ఉదయం 7 గంటల నుంచి రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. 415 GPలు ఏకగ్రీవం కాగా మిగిలిన 3,911 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం 38,350 పోలింగ్ సెంటర్లను ఈసీ ఏర్పాటు చేసింది. మొత్తం 57,22,665 మంది ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగనుండగా 2 గంటలకు లెక్కింపు ప్రక్రియ మొదలు కానుంది. అనంతరం ఫలితాలు వెలువడనున్నాయి.