News March 17, 2025
PPM: పదో తరగతి పరీక్షలను పరిశీలించిన కలెక్టర్

పార్వతీపురం జిల్లాలో సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ పార్వతీపురం ఆర్.సి.యం. సెయింట్ పీటర్స్ (ఇ.యం) హై స్కూల్‌లో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షలను పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన మౌలిక వసతులను, పరీక్షా నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు.
Similar News
News March 17, 2025
నంద్యాల: పోలీసుల గ్రీవెన్స్ డేకు 72 అర్జీల రాక

నంద్యాలలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే జరిగింది. మొత్తం 72 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఫిర్యాదులను విచారించి చట్ట పరిధిలో న్యాయం చేస్తామన్నారు. ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా.. త్వరగా పరిష్కారానికి కృషి చేయాలని సంబంధిత పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు.
News March 17, 2025
కృష్ణా: జిల్లాలో TODAY TOP NEWS

★ కృష్ణా జిల్లాలో ప్రశాంతంగా పది పరీక్షలు..<<15794120>> 286 గైర్హాజరు <<>>
★ కృష్ణా: Way2Newsతో విద్యార్థులు
★ కృష్ణా: టెన్త్ విద్యార్థులకు యూనిఫామ్<<15791358>> అనుమతి లేదు<<>>
★ అసెంబ్లీలో గన్నవరం <<15790326>>ఎమ్మెల్యే ఆవేదన<<>>
★ కృతి వెన్నులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
★ అవనిగడ్డలో కొడుకు ముందే తల్లి మరణం
★ పెడనలో టీడీపీ <<15787375>>నాయకుడిపై దాడి<<>>
★ గన్నవరంలో వెటర్నరీ విద్యార్థుల<<15792654>> ఆందోళన<<>>
News March 17, 2025
TG న్యూస్ రౌండప్

☛ అనారోగ్యానికి గురై HYD ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అచ్చంపేట MLA వంశీకృష్ణను పరామర్శించిన CM రేవంత్
☛ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో కేటీఆర్ సరదా సంభాషణ.. ఆరోగ్యం ఎలా ఉందని అడిగిన KTR
☛ రేపు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు
☛ SLBC సొరంగంలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. మరోసారి టన్నెల్‌లోకి క్యాడవర్ డాగ్స్
☛ ఓబులాపురం మైనింగ్ కేసు.. బీవీ శ్రీనివాస్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు