News March 14, 2025
PPM: ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 365 గైర్హాజరు

ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు గురువారం 365 గైర్హాజరైనట్లు DVEO మంజులా వీణ తెలిపారు. పార్వతీపురం జిల్లావ్యాప్తంగా 34 పరీక్షా కేంద్రాల్లో 7,278 మంది విద్యార్థులు పరీక్షలు రాయవలసి ఉండగా 6,912 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. 5,665 మంది జనరల్ విద్యార్థులకు గాను 5,493 మంది విద్యార్థులు హాజరయ్యారు. 1,613 ఒకేషనల్ విద్యార్థులకు 1,419 మంది పరీక్ష రాశారని చెప్పారు.
Similar News
News March 14, 2025
నటన వదిలేద్దామనుకున్నా.. నాన్న ఆపారు: అభిషేక్ బచ్చన్

దిగ్గజ నటుడైన అమితాబ్ బచ్చన్ వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన అభిషేక్ బచ్చన్ కెరీర్ తొలినాళ్లలో వరసగా 12కు పైగా ఫ్లాపుల్ని చవిచూశారు. ఆ సమయంలో సినిమాల్ని వదిలేయాలని తాను భావించినట్లు ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. ‘ఓరోజు నాన్నతో నా బాధ చెప్పాను. ఈ రంగం వదిలేస్తానన్నాను. కానీ నాన్న నన్ను వారించారు. నేనింకా నేర్చుకునే దశలోనే ఉన్నానని, పోరాటం ఆపొద్దని చెప్పి నాలో స్ఫూర్తి నింపారు’ అని వెల్లడించారు.
News March 14, 2025
NGKL: జిల్లాలో భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు..

నాగర్ కర్నూల్ జిల్లాలో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. మార్చ్ నెల మొదటి వారంలోని ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లాలోని తెలకపల్లి మండల కేంద్రంలో గడిచిన 24 గంటల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కల్వకుర్తి ప్రాంతంలో శుక్రవారం ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు చేరుకున్నాయి.
News March 14, 2025
స్టార్ క్రికెటర్ కూతురు మృతి

అఫ్గానిస్థాన్ స్టార్ బ్యాటర్ హజ్రతుల్లా జజాయ్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన రెండేళ్ల కూతురు మరణించినట్లు అఫ్గాన్ జట్టు ఆటగాడు కరీం జనత్ ఇన్‌స్టా ద్వారా వెల్లడించారు. చిన్నారి ఫొటోను షేర్ చేశారు. అయితే ఆమె ఎలా మరణించిందనేది తెలియరాలేదు. స్టార్ హిట్టర్‌గా పేరొందిన జజాయ్ T20ల్లో 6 బంతులకు 6 సిక్సర్లు బాదడం, ఫాస్టెస్ట్ ఫిఫ్టీ(12 బంతుల్లో) చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరారు.