News March 15, 2025
PPM: మూడు అంబులెన్స్‌లను అందించిన NPCI

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పార్వతీపురం మన్యం జిల్లాకు మూడు అంబులెన్స్‌లను అందించారు. ఈ అంబులన్స్‌లను సాలూరులో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించగా, పార్వతీపురంలో జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్, స్థానిక శాసన సభ్యులు బోనెల విజయ చంద్రతో కలసి శనివారం ప్రారంభించారు.
Similar News
News March 16, 2025
రాజకీయ పార్టీ నాయకులతో కలెక్టర్ సమీక్ష

భద్రాద్రి జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నాయకులతో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సమీక్ష జరిపారు. ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా రూపకల్పన, ఓటరు జాబితా సంబంధిత ఫారాలు 6, 7, 8లపై రాజకీయ పార్టీ నాయకులకు అవగాహన కల్పించారు. రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించాలని, బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితా పార్టీ జిల్లా ఇంచార్జ్ ధ్రువీకరణ చేసి అందించాలని సూచించారు.
News March 16, 2025
ఇందిరమ్మ మోడల్ ఇంటి పనులు పరిశీలించిన కలెక్టర్

మెదక్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. పనుల పురోగతిని అంచనా వేశారు. 45 రోజులలో పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులకు ఆదేశించారు. ఇందిరమ్మ మోడల్ హౌసింగ్ పథకం ద్వారా పేదలకు మంచి గృహాలను అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన అన్నారు.
News March 16, 2025
ఎల్ఆర్ఎస్ పై నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్

ఎల్ఆర్ఎస్ పై అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. సంగారెడ్డి నుంచి మున్సిపల్, పంచాయతీ అధికారులతో శనివారం రాత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ పై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని చెప్పారు. రోజువారి నివేదికలను తనకు సమర్పించాలని పేర్కొన్నారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.