News April 17, 2025

PPM: మే 12వ తేదీ నుంచి సప్లమెంటరీ పరీక్షలు

image

ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలను మే 12వ తేదీ ప్రారంభం కానున్నట్లు డీఐఈఓ మంజుల వీణ తెలిపారు. ఇంటర్ పరీక్షల్లో తప్పిన విద్యార్థులు ఈ నెల 22 తేదీలోపు పరీక్ష పీజు చెల్లించేందుకు గడువు అని చెప్పారు. ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండ్ ఇయర్‌కి మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు నిర్వహించనున్నట్లు గురువారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. 

Similar News

News April 19, 2025

పెద్దపల్లిలో అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్

image

పెద్దపల్లి జిల్లాలో అంతర్రాష్ట్ర ATM దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు డీసీపీ కరుణాకర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. దొంగలు రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు సొంత అన్నదమ్ములుగా గుర్తించారు. గత కొద్దిరోజులుగా వస్తున్న ఫిర్యాదులపై పోలీసులు నిఘా పెంచి గాలించారు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

News April 19, 2025

ములుగు: ఆ స్వామి నాభి చందనం సేవిస్తే.. సంతానం కలుగుతుంది!

image

తెలంగాణలోనే 2వ యాదగిరిగుట్టగా పిలుచుకునే మంగపేట మండలం మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. 6వ శతాబ్దంలోని చోళ చక్రవర్తుల కాలంనాటి నుంచే ఈ ఆలయం ఉన్నట్లు చెబుతుంటారు. స్వామి వారి బొడ్డు నుంచి కారే ద్రవం(నాభి చందనం)కు ఓ ప్రత్యేకత ఉంది. ఆ ద్రవం సేవిస్తే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. ఎంతోమందికి సంతానం కలిగిందని ఇక్కడి అర్చకులు చెబుతుంటారు.

News April 19, 2025

కూసుమంచి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

image

కూసుమంచిలోని హైస్కూల్ ఎదురుగా రెండు రోజుల క్రితం రెండు మోటార్ సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయపడిన పోచారం గ్రామానికి చెందిన ఇందుర్తి శ్రీనివాసరెడ్డి చనిపోయారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

error: Content is protected !!