News February 2, 2025

PPM: రూ. 3 కోట్లతో జిల్లా ఆసుపత్రిలో మరమ్మతు పనులు

image

పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో రూ.3 కోట్లతో మరమ్మతు పనులను చేపడుతున్నట్లు ఏపీ ఎంఎస్ఐడీసీ కార్యనిర్వాహక ఇంజినీర్ ఎం.శ్రీనివాసమూర్తి తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పనుల్లో భాగంగా ఆసుపత్రి ముందు రహదారి, మేనహోల్స్, విద్యుత్ పనులు, ఆసుపత్రి కాంపౌండ్‌లోని కాలువల నిర్మాణం చేయాల్సి ఉందన్నారు. వారం రోజుల్లో ఈ పనులు ప్రారంభించనున్నట్లు ఆయన ఆ ప్రకటనలో వివరించారు.

Similar News

News November 4, 2025

తెల్లారకముందే జూబ్లీలో పార్టీల కూత

image

సూర్యుడు ఇంకా ఉదయించక ముందే.. మంత్రులు, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు జూబ్లీ వీధుల్లో వాలిపోతున్నారు. ఉపఎన్నిక సందర్భంగా ఓటర్లను కలుస్తూ నచ్చిన హామీలిస్తున్నారు. ప్రచారానికి వెళ్లడం ఆలస్యమైతే ఓటర్లు పనులకు వెళ్లిపోతారని కాబోలు. ఇక్కడ ఎక్కువ శాతం బస్తీలు ఉండటంతో ప్రజలు ఉపాధి కోసం పనులకు వెళ్తారు. అందుకే నాయకులు ఉదయాన్నే ప్రచారానికి వెళుతున్నారు.

News November 4, 2025

6న పత్తి కొనుగోలు స్లాట్ బుకింగ్ చేసుకోవద్దు: అ.కలెక్టర్

image

ఈనెల 6న పత్తి కొనుగోలు స్లాట్ బుకింగ్ చేసుకోవద్దని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం పత్తి కొనుగోలు పై మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, జిన్నింగ్ మిల్ యాజమాన్యం, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బంద్ పిలుపుమేరకు సీసీ కొనుగోలు కేంద్రాలకు ఆ రోజు పత్తి తీసుకురావద్దని సూచించారు.

News November 4, 2025

వరి మాగాణుల్లో పంట ఎంపిక.. ఇవి ముఖ్యం

image

వరి మాగాణుల్లో పంట ఎంపికకు ముందు రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం. రైతులు ఎంపిక చేసుకునే ప్రత్యామ్నాయ పంటలకు స్థిరమైన మార్కెట్, మద్దతు ధర ఉండేలా చూసుకోవాలి. కనీస మద్దతు ధర, పంట భీమా, నాణ్యమైన విత్తనాలు సకాలంలో లభించే పంటలను ఎన్నుకోవాలి. వరికి ప్రత్యామ్నాయంగా ఎన్నుకునే పంటలు తక్కువ నీటిని వినియోగించుకొని, దిగుబడిని అందించేవి అయ్యి ఉండాలి.