News April 2, 2025

PPM: రెవెన్యూ సదస్సుల్లో 99.34 శాతం పూర్తి

image

జిల్లాలో 6,246 రెవెన్యూ సదస్సులకు గాను 6,205 సదస్సులను చేపట్టి 99.34 శాతం మేర పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అడిషనల్ సీసీఎల్ఎకు వివరించారు. రెవెన్యూ సదస్సులు, పీజీఆర్ఎస్, రెగ్యులరైజేషన్, నీటి పన్ను తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో అడిషనల్ సీసీఎల్ఎ, సెక్రటరీ డా. ఎన్.ప్రభాకరరెడ్ది బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాల వారీగా ప్రగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Similar News

News February 27, 2026

రైల్వే టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చొచ్చు!

image

కన్ఫర్మ్ అయిన రైలు టికెట్‌పై ప్రయాణించే వ్యక్తి పేరును మార్చుకునే వెసులుబాటును రైల్వే కల్పిస్తోంది. మీ టికెట్‌ను మీ నాన్న, అమ్మ, బ్రదర్, సిస్టర్, కొడుకు, కూతురు లేదా భార్యాభర్తల పేరు మీదకు మార్చుకోవచ్చు. దీనికోసం ప్రయాణానికి 24 గంటల ముందే టికెట్, ID ప్రూఫ్‌తో రిజర్వేషన్ ఆఫీసర్‌ను కలవాలి. ప్రభుత్వ ఉద్యోగులు, స్టూడెంట్స్, పెళ్లి బృందాలకు కూడా ఈ ఛాన్స్ ఉంది. ఈ మార్పు ఒక్కసారి మాత్రమే కుదురుతుంది.

News February 27, 2026

పోక్సో కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష: అల్లూరి ఎస్పీ

image

జీకేవీధి పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక దాడి, హత్యకు పాల్పడిన నిందితుడు పాంగి రమేశ్ అలియాస్ పోయి రమేశ్‌కు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. గురువారం ఎస్పీ అమిత్ బర్దార్ వివరాలను వెల్లడించారు. నిందితుడికి శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చిందని తెలిపారు. కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసిన జీకేవీధి పోలీసులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

News February 27, 2026

అధిక యూరియాతో పంటకు కలిగే నష్టాలు

image

చాలా మంది రైతులు ఎక్కువ దిగుబడి వస్తుందని పంటకు అధికంగా యూరియా వేస్తున్నారు. సిఫార్సుకు మించి వేసిన యూరియా ఒకేసారి నీటిలో కరిగిపోతుంది. 2-3 రోజుల్లో పంట కొంత వరకు మాత్రమే తీసుకోగలుగుతుంది. మిగిలింది వృథాగా భూమి లోపలి పొరల్లోకి, ఆవిరి రూపంలో గాలిలో కలిసిపోతుంది. దీని వల్ల ఎరువు నష్టంతో పాటు పంటను ఎక్కువగా పురుగులు, తెగుళ్లు ఆశించి బలహీన పరుస్తాయి. కాబట్టి నిపుణుల సిఫార్సు మేరకే యూరియా వేసుకోవాలి.