News March 28, 2025

PPM: ‘శ్రీ విశ్వావ‌సు ఉగాది వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వహించాలి’

image

జిల్లాలో శ్రీ విశ్వావ‌సు నామ సంవత్సర ఉగాది వేడుక‌ల‌ను సంప్రదాయ రీతిలో ఘనంగా నిర్వహించాల‌ని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఉగాది వేడుక‌ల ఏర్పాట్లపై సంబంధిత శాఖాధికారుల‌తో స‌మీక్షా స‌మావేశాన్ని కలెక్టర్ నిర్వ‌హించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో స్థానిక లయన్స్ కళ్యాణ మండపం వేదికగా ఈనెల 30వ తేదీన ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు.

Similar News

News November 24, 2025

RECORD: ఎకరం రూ.137 కోట్లు

image

TG: హైదరాబాద్ కోకాపేట్‌లో భూములు రికార్డు ధర పలికాయి. నియోపొలిస్‌లో ప్లాట్ నం.17, 18లకు HMDA ఈ-వేలం నిర్వహించింది. ప్లాట్ నం.18లో ఎకరం భూమి రూ.137 కోట్లు, ప్లాట్ నం.17లో ఎకరం భూమి రూ.136.25 కోట్లు పలికింది. మొత్తం 9.9 ఎకరాలకు గాను HMDA రూ.1,355 కోట్లు దక్కించుకుంది. డిసెంబర్ 9న ప్లాట్ నం.19కు ఈ-వేలం జరగనుండగా ఎకరం రూ.150 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు.

News November 24, 2025

సింగూరు డ్యామ్ ఎందుకు దెబ్బతిందంటే!

image

నగరానికి తాగునీరు అందించే సింగూరు జలాశయం ఇటీవల కాలంలో దెబ్బతింది. అధిక మోతాదులో నీటిని నిల్వ చేయడంతోనే ఈ సమస్య వచ్చింది. ప్రాజెక్ట్ డిజైన్ ప్రకారం 517.8 మీటర్ల వరకే నీటిని నిల్వ చేయాలి. అయితే గత ప్రభుత్వం మిషన్ భగీరథ కోసం నిల్వలను పెంచాలని ఆదేశించింది. దీంతో 522 మీటర్ల వరకు నీటిని నిల్వ చేస్తూ వస్తున్నారు. ఈ కారణంగా ప్రాజెక్టుపై ఒత్తిడి పెరిగి దెబ్బతింది. అందువల్లే మరమ్మతు చేయనున్నారు.

News November 24, 2025

ప్రజల నుంచి 450 అర్జీల స్వీకరణ: అనంత కలెక్టర్

image

అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ సోమవారం కలెక్టరేట్‌లోని PGRS కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలనుంచి 450 అర్జీలను స్వీకరించామని తెలిపారు. PGRS అర్జీలను నాణ్యతగా పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ జరిపి త్వరగా పరిష్కరిస్తామని అన్నారు.