News February 14, 2025
PPM: సంజీవయ్య ప్రేరణతో ముందుకు సాగాలి

దామోదరం సంజీవయ్య స్పూర్తి, ప్రేరణతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. దామోదరం సంజీవయ్య జయంతిని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని దామోదరం సంజీవయ్య చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి, పూలమాలను వేసి నివాళులర్పించారు.
Similar News
News January 10, 2026
మార్స్కైనా వెళ్లాల్సిందే: బంగ్లా క్రికెటర్

భారత్‌తో సంబంధాలు దెబ్బతినడంతో మన దేశంలో T20WC ఆడేందుకు <<18807855>>BCB <<>>నిరాకరించిన విషయం తెలిసిందే. దీనిపై వరల్డ్ కప్ కోసం ఎంపికైన బంగ్లా ఆల్‌రౌండర్ మహెదీ హసన్ స్పందించారు. ‘అనిశ్చితి అనేది మేనేజ్మెంట్ సమస్య. దానిని అఫీషియల్స్ డీల్ చేయాల్సి ఉంటుంది. మా పని క్రికెట్ ఆడటం మాత్రమే. మీరు ఆటగాళ్లను మార్స్‌కు పంపినా వెళ్లి ఆడతారు. దానిపై వారికి ఎలాంటి అభ్యంతరం ఉండదు’ అని వ్యాఖ్యానించారు.
News January 10, 2026
మరోసారి చర్చకు టికెట్ రేట్ల పెంపు!

ప్రీమియర్ షోలు, టికెట్ రేట్ల పెంపుపై TG ప్రభుత్వ నిర్ణయాలు అభిమానులను అయోమయానికి గురిచేస్తున్నాయి. మొన్న అర్ధరాత్రి జారీ చేసిన ‘రాజాసాబ్’ టికెట్ రేట్ల పెంపు మెమోను నిన్న HC సస్పెండ్ చేసింది. జీవో 120 ప్రకారం టికెట్ రేట్ రూ.350 మించకూడదని స్పష్టం చేసింది. ఇంతలోనే తాజాగా ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా ప్రీమియర్స్‌కు <<18817046>>అనుమతి<<>> ఇవ్వడం, టికెట్ రేట్‌ను రూ.600గా నిర్ణయించడంపై విమర్శలు వస్తున్నాయి. COMMENT
News January 10, 2026
మంచిర్యాల: రిజర్వేషన్‌పైనే ఆశావాహుల ఆశలు

మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఛైర్మన్, కౌన్సిలర్ స్థానాల రిజర్వేషన్లపై అధికారిక స్పష్టత రానప్పటికీ, పాత, కొత్త ఆశావహులు ప్రచార పర్వంలో నిమగ్నమయ్యారు. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు మారుతాయని భావిస్తున్న నేతలు, తమకు అనుకూలంగా వస్తుందనే ఆశతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. వార్డుల్లో పర్యటిస్తూ పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.


