News March 21, 2025
PPM: సీపీహెచ్సీలకు సూచనలు చేసిన డీఎంహెచ్ఓ

సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ (CPHC) శిక్షణ ద్వారా నేర్చుకున్న నైపుణ్యంతో గ్రామీణ స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందజేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు సూచించారు. స్టాఫ్ నర్స్,ఏఎన్ఎం లకు సిపిహెచ్సి శిక్షణా కార్యక్రమాన్ని బ్యాచ్‌ల వారీగా నిర్వహించారు. ఈ మేరకు ఎన్జీఓ హోమ్‌లో శుక్రవారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో డీఎంహెచ్ఓ మాట్లాడారు.
Similar News
News September 18, 2025
నేడు ప్రపంచ వెదురు దినోత్సవం

ఏ ప్రాంతమైనా, భూమి రకం ఎలాంటిదైనా సాగుకు అనుకూలమైన పంట వెదురు. తక్కువ పెట్టుబడితో నీటి వసతి నామమాత్రంగా ఉన్నా, ఎరువులు, పురుగు మందులతో పనిలేకుండా ఈ పంటను సాగు చేయవచ్చు. వంట చెరకుగా, వివిధ నిర్మాణాలు, ఫర్నిచర్, కళాకృతుల తయారీలో దీన్ని ఉపయోగిస్తున్నారు. వెదురు పంట రైతులకు ఆర్థికంగా చేయూతనిస్తూ, పర్యావరణానికీ ఎంతో మేలు చేస్తోంది. ఏటా సెప్టెంబర్-18న ప్రపంచ వెదురు దినోత్సవం నిర్వహిస్తున్నారు.
News September 18, 2025
జగిత్యాల నాయకులకు మన్ కీ బాత్ బాధ్యతలు

భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో జిల్లాల వారీగా మన్ కీ బాత్ కన్వీనర్లు, కో-కన్వీనర్లను నియమించింది. ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరవేస్తున్న సందేశాలను ప్రతి జిల్లాలో ప్రసారం చేసి, గ్రామస్థాయికి చేర్చే బాధ్యత ఈ నియమిత నాయకులపై ఉండనుంది. JGTL నుంచి పిల్లి శ్రీనివాస్ కన్వీనర్‌గా, దొణికెల నవీన్ కో-కన్వీనర్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వీరికి శుభాకాంక్షలు తెలిపారు.
News September 18, 2025
నక్కపల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

నక్కపల్లి మండలం వెదుళ్లపాలెం వద్ద నేషనల్ హైవేపై గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ క్లీనర్ మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. డ్రైవర్ లారీని రోడ్డు పక్క నిలిపాడు. క్లీనర్ మహమ్మద్ జియావుద్దీన్ రోడ్డు దాటుతుండగా విశాఖ నుంచి తుని వైపు వెళ్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సన్నిబాబు తెలిపారు.