News March 10, 2025
PPM: ’45 మందికి పైగా విద్యార్థులు ఉంటే మోడల్ ప్రైమరీ స్కూళ్లు’

45 మందికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూళ్లుగా పరిగణించాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడిని ప్రభుత్వం నియమిస్తుందని అన్నారు. తద్వారా నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించే అవకాశం ఉంటుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Similar News
News November 4, 2025
ASF: మహిళల భద్రతకు షీ టీమ్స్: ఎస్పీ కాంతిలాల్ పాటిల్

ఆసిఫాబాద్ జిల్లాలో మహిళలు, యువతుల భద్రత కోసమే షీ టీమ్స్ పనిచేస్తున్నాయని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. హింసకు గురైతే నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని ఆయన సూచించారు. అక్టోబర్ నెలలో షీ టీమ్స్ ద్వారా 87 హాట్‌స్పాట్‌లను గుర్తించి, 22 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ క్రమంలో 16 మంది అకతాయిలను పట్టుకుని, ఆరుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు.
News November 4, 2025
మంచిర్యాల: మత్స్యకారుల సంక్షేమం దిశగా చేప పిల్లల పంపిణీ

రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర పశుసంవర్ధక,మత్స్య,పాడి పరిశ్రమల,క్రీడా యువజన శాఖ మంత్రి శ్రీహరి అన్నారు. Hyd నుంచి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ..223.93లక్షల చేప పిల్లల పెంపునకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు.
News November 4, 2025
పోలీస్ పీజీఆర్‌ఎస్‌కు 105 పిటిషన్లు: ఎస్పీ

అనంతపురం ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 105 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పిర్యాదు దారులతో ఆయన నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.


