News March 10, 2025
PPM: ’45 మందికి పైగా విద్యార్థులు ఉంటే మోడల్ ప్రైమరీ స్కూళ్లు’

45 మందికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూళ్లుగా పరిగణించాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడిని ప్రభుత్వం నియమిస్తుందని అన్నారు. తద్వారా నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించే అవకాశం ఉంటుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Similar News
News March 11, 2025
ADB: LRSపై అధికారుతో కలెక్టర్ సమావేశం

ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో LRS క్రమబద్ధీకరణ రుసుంపై మున్సిపల్, గ్రామపంచాయితీ అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. LRS అవుట్ క్రమబద్ధీకరణపై ఏమైనా సందేహాలు ఉంటే కలెక్టరేట్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మార్చ్31లోగా క్రమబద్ధీకరణ రుసుం చెల్లించే వారికి 25 శాతం రిబేట్ వర్తిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News March 11, 2025
ఆ కారు ఉత్పత్తిని ఆపేయనున్న మారుతీ?

తమ సెడాన్ కారు సియాజ్ ఉత్పత్తిని ఇకపై ఆపేయాలని మారుతీ సుజుకీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 2014లో ఆ కారును సంస్థ తీసుకొచ్చింది. గత కొన్నేళ్లుగా సియాజ్కు ఆదరణ బాగా తగ్గింది. ఈ ఏడాది కేవలం 7726 యూనిట్లను మాత్రమే విక్రయించింది. మరోవైపు పోటీ సంస్థల నుంచి సిటీ, విర్చస్, స్లేవియా, వెర్నా వంటి కార్లు దూసుకెళ్తుండటంతో సియాజ్ ఉత్పత్తిని ఇక నిలిపేయాలని సంస్థ నిర్ణయించినట్లు సమాచారం.
News March 11, 2025
అనర్హులని తేలితే ఏదశలో ఉన్నా ఇల్లు రద్దు చేస్తాం: మంత్రి పొంగులేటి

తెలంగాణ వ్యాప్తంగా ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఎంపిక చేసి పనులు ప్రారంభించామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా పనులు ప్రారంభించామని.. లబ్ధిదారులు అనర్హులని తేలితే నిర్మాణం ఏ దశలో ఉన్నా ఎలాంటి ఆలోచన లేకుండా ఇల్లు రద్దు చేస్తామని తేల్చిచెప్పారు.