News February 4, 2025
PPM: ప్రతికూల వార్తలపై అధికారులు తక్షణమే స్పందించాలి
జిల్లాలో సంస్థాగతంగా ప్రజలకు సేవలు అందించడంలో లోపాలు పట్ల వివిధ పత్రికల్లో వస్తున్న ప్రతికూల వార్తలపై జిల్లా అధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా, మండల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి అధికారి పూర్తిస్థాయిలో ప్రజలకు సేవలు అందించాలని కోరారు.
Similar News
News February 4, 2025
పెన్షన్ల పంపిణీపై సీఎం కీలక ఆదేశాలు
AP: ఉదయం 5, 6 గంటలకే పింఛన్ల పంపిణీ ప్రారంభించాల్సిన అవసరం లేదని CM చంద్రబాబు స్పష్టం చేశారు. ఇదే విషయంపై ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు వస్తుండటంతో ఆయన స్పందించారు. అనవసర నిబంధనలతో ఇబ్బంది పెట్టొద్దని, ఉ.7 నుంచి సా.6 లోపు పంపిణీ పూర్తి చేస్తే సరిపోతుందని చెప్పారు. ఇంటి వద్ద కాకుండా ఇతర ప్రాంతాల్లో పెన్షన్ ఇస్తున్నట్లు తేలితే కారణాలు తెలుసుకోవాలన్నారు. లబ్ధిదారులతో గౌరవంగా వ్యవహరించాలని సూచించారు.
News February 4, 2025
ఏలూరు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో 16,077 ఓట్లు
ఏలూరు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 16,077 మంది ఓటర్లు ఉన్నారని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి వెట్రి సెల్వి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఓట్లలో 9,858 మంది పురుషులు, 6,218 మంది మహిళలు, ఒక ట్రాన్స్జెండర్ ఉన్నారన్నారు. 20 పోలింగ్ స్టేషన్లకు అదనంగా, మరో పోలింగ్ కేంద్రాన్ని ప్రతిపాదించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 8,501 క్లైమ్‌లు అందాయన్నారు.
News February 4, 2025
మగవారికీ పొదుపు సంఘాలు.. అనూహ్య స్పందన
AP: ఇన్నాళ్లూ మహిళలకు పరిమితమైన పొదుపు సంఘాలను మెప్మా పురుషులకూ విస్తరిస్తోంది. తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా 2,841గ్రూపులను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకోగా నెల రోజుల్లోనే 1,028సంఘాలు ఏర్పడ్డాయి. మార్చి 31 నాటికి టార్గెట్‌ను చేరుకునేలా అధికారులు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. రోజువారీ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, సెక్యూరిటీగార్డులకు ఆర్థిక స్వావలంబన కోసం పొదుపు సంఘాలు ఉపయోగపడతాయని చెబుతున్నారు.