News February 7, 2025
PPM: మన్యం జిల్లా ఆశావాహ జిల్లాల్లో అగ్రస్థానంలో ఉండాలి
పార్వతీపురం మన్యం దేశంలోని ఆశావాహ జిల్లాల్లో అగ్రగామిగా నిలపాలని జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఆశావాహ జిల్లాల విభాగంలో పార్వతీపురానికి ప్రధానమంత్రి అవార్డు రావాలని అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత శాఖలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గతేడాది భామిని బ్లాక్ దక్షిణ భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, ఇదే స్ఫూర్తిని బ్లాక్‌తో పాటు జిల్లాలోనూ కొనసాగించాలన్నారు.
Similar News
News February 7, 2025
అయోధ్య ఆలయ దర్శన సమయం మార్పు
అయోధ్య రాముడి దర్శనం ఉదయం 6గంటల నుంచే ప్రారంభించనున్నట్లు శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. ఇప్పటి వరకూ ఉదయం 7గంటలకు ఆలయాన్ని తెరుస్తుండగా.. భక్తులు అధికంగా వస్తుండటంతో దర్శన సమయాలు మార్చినట్లు తెలిపారు. రాముల వారికి ఉదయం 4గంటలకు మంగళహారతి, 6గంటలకు ‘శ్రింగార్ హారతి’ ఇచ్చిన అనంతరం ఆలయాన్ని తెరుస్తారు. రాత్రి పదిగంటల వరకూ స్వామివారిని దర్శించుకోవచ్చు.
News February 7, 2025
చొప్పదండి: నవోదయ పరిమిత సీట్ల ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
చొప్పదండి నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతులలో పరిమిత సీట్లకు శనివారం జరిగే ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9వ తరగతిలో ప్రవేశానికి 1340 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 11వ తరగతిలో ప్రవేశానికి 1278 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ప్రిన్సిపల్ మంగతాయారు తెలిపారు. అభ్యర్థులు 10 గంటల లోపు హాల్ టికెట్, ఆధార్ కార్డుతో హాజరు కావాలని ప్రిన్సిపల్ సూచించారు.
News February 7, 2025
అనకాపల్లి: పోలీసులకు గ్రీవెన్స్ నిర్వహించిన ఎస్పీ
అనకాపల్లి జిల్లాలో పోలీసులకు ఎస్పీ తుహీన్ సిన్హా శుక్రవారం జిల్లా కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. పోలీస్ సిబ్బంది, హోమ్ గార్డ్స్ ఎస్పీ ముందు హాజరై వారి వ్యక్తిగత అనారోగ్య సమస్యలను తెలిపారు. ఈ మేరకు విజ్ఞప్తి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అర్జీలను పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.