News March 16, 2025
PPM: మూడు అంబులెన్స్‌లను అందించిన NPCI

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పార్వతీపురం మన్యం జిల్లాకు మూడు అంబులెన్స్‌లను అందించారు. ఈ అంబులన్స్‌లను సాలూరులో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించగా, పార్వతీపురంలో కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్, స్థానిక శాసన సభ్యులు బోనెల విజయ చంద్రతో కలసి శనివారం ప్రారంభించారు.
Similar News
News March 16, 2025
OTD: సచిన్ సెంచరీల సెంచరీ

సచిన్ టెండూల్కర్ అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించి నేటికి 13 ఏళ్లు అయింది. మార్చి 16, 2012లో బంగ్లాపై సెంచరీ చేసి అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచారు. సచిన్ 99 సెంచరీలు చేసి 100 శతకాలు పూర్తి చేయడానికి ఏడాదికి పైగా (369రోజులు) సమయం పట్టింది. ఇప్పటి వరకు మాస్టర్ బ్లాస్టర్ రికార్డ్ చెక్కుచెదరకపోగా, యాక్టివ్ ప్లేయర్లలో కోహ్లీ(82) ఒక్కరే ఆ మైలురాయికి దగ్గర్లో ఉన్నారు.
News March 16, 2025
ఎన్నో రూపాల్లో మోసాలు జరుగుతాయి: ఎస్పీ

బ్యాంకులు, ప్రభుత్వ సంస్థ, ఇతర విశ్వసనీయ సంస్థల నుంచి వచ్చినట్లుగా నమ్మించి నకిలీ ఈ మెయిల్‌లు, సందేశాలు పంపి మోసగిస్తారని, ఈ మోసాలు వివిధ రూపాల్లో జరుగుతాయని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. అనుమానాస్పదమైన ఈ మెయిల్ పట్ల జాగ్రత్త వహించాలన్నారు. వ్యక్తిగత సమాచారం, ఆర్థిక వివరాలను అడిగే అభ్యర్థనలను బాగా గమనించండి. వెబ్‌సైట్‌ల URLలను జాగ్రత్తగా పరిశీలించాలన్నారు.
News March 16, 2025
HYD: డ్రంక్ అండ్ డ్రైవ్.. 315 మంది చిక్కారు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు శనివారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 315 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 233 ద్విచక్ర వాహనాలు, 5 త్రిచక్ర వాహనాలు, 71 నాలుగు చక్రాల వాహనాలు, 6 హెవీ వెహికిల్ వాహనాలు పట్టుబడ్డాయన్నారు. పట్టుబడ్డ వారందరినీ కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవన్నారు.