News November 17, 2025
PPP మోడల్‌లో ఆటోనగర్ బస్టాండ్ అభివృద్ధి.. ఉయ్యూరు, గుడివాడ కూడా?

విజయవాడ ఆటోనగర్ బస్టాండ్‌ను పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ విధానంలో అభివృద్ధి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 10 ప్లాట్‌ఫామ్స్, వ్యాపార సముదాయాలు ఉండేలా ప్లాన్ సిద్ధం చేశారు. అనుమతులు రాగానే కాంట్రాక్టర్‌కు పనులు అప్పగిస్తారు. రద్దీగా ఉన్న PNBSకి ప్రత్యామ్నాయంగా ఆటోనగర్ బస్టాండ్‌ను వినియోగించుకునే యోచనలో ఉన్నారు. ఉయ్యూరు, గుడివాడ బస్టాండ్‌ల అభివృద్ధికి కూడా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
Similar News
News November 17, 2025
వరంగల్ కమిషనరేట్ పరిధిలో 118 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

మందు బాబులు వాహనాలు నడపడం కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 118 కేసులు నమోదయ్యాయి. ఇందులో ట్రాఫిక్ పరిధిలోనే 60 కేసులు ఉన్నాయి. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని, వాహనం సీజ్ చేసి కౌన్సిలింగ్ ఇస్తామని పోలీసులు వాహనదారులను హెచ్చరించారు.
News November 17, 2025
ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించిన GWMC కమిషనర్

గ్రీవెన్స్ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని మాట్లాడారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిష్కరార్థమై ఆయా విభాగాల ఉన్నతాధికారులకు అందజేశారు. GWMCలో జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News November 17, 2025
జగిత్యాల: రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ నల్లగుట్ట చౌరస్తా వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. బైక్, కారు ఎదురెదురుగా ఢీకొనడంతో గొల్లపల్లి మండలం శేకల్లకు చెందిన అరుణ్(21) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. అదే బైక్‌పై ఉన్న మరో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. స్థానికులు వారిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.


