News December 20, 2025
PPP వివాదం.. 104, 108 ఎలా వచ్చాయని సీఎం ప్రశ్న

AP: మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ఇవ్వలేదని, అది పీపీపీ విధానం అని సీఎం చంద్రబాబు అనకాపల్లి సభలో స్పష్టం చేశారు. ‘పీపీపీతో మెడికల్ కాలేజీల్లో సీట్లు పెరుగుతాయి. ఎన్టీఆర్ వైద్యసేవ కింద 70% వైద్యసేవలు అందుతాయి. ప్రైవేటుకు ఇచ్చామని దుష్ప్రచారం చేస్తున్నారు. 104, 108 దేని కింద ఇచ్చారు?’ అని ప్రశ్నించారు. రూ.500 కోట్లతో రుషికొండ భవనాలు కట్టిన వ్యక్తులు ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేకపోయారని విమర్శించారు.
Similar News
News December 23, 2025
డిసెంబర్ 23: చరిత్రలో ఈ రోజు

☛ 1902: భారత మాజీ ప్రధాని చరణ్ సింగ్ జననం
☛ 1940: ప్రముఖ నవలా రచయిత ముదిగొండ శివప్రసాద్ జననం
☛ 1997: పండితుడు గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి మరణం
☛ 2004: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మరణం(ఫొటోలో)
☛ 2014: ప్రముఖ దర్శకుడు బాలచందర్ మరణం
☛ 2022: ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ మరణం
– జాతీయ రైతు దినోత్సవం
News December 23, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 23, 2025
ENG కోచ్‌గా తప్పుకుంటారా? మెక్‌కల్లమ్ ఏమన్నారంటే?

యాషెస్ సిరీస్‌ను <<18628859>>ENG కోల్పోవడంతో<<>> కోచ్ మెక్‌కల్లమ్, బజ్‌బాల్ ఆటపై విమర్శలొస్తున్నాయి. దీంతో మెక్‌కల్లమ్ కోచ్‌గా కొనసాగుతారా అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై ఆయన స్పందిస్తూ ‘అది నా చేతుల్లో లేదు. కోచింగ్‌ను ఆస్వాదిస్తున్నా. ప్లేయర్ల నుంచి బెస్ట్ రాబట్టడమే నా పని. నేను కోచ్‌గా వచ్చాక టీమ్ ఇంప్రూవ్ అయింది. నేను కోచ్‌గా ఉన్నంత వరకు మా ఆట తీరు మారదు. మిగిలిన 2 టెస్టుల్లో బెస్ట్ ఇస్తాం’ అని చెప్పారు.


