News March 22, 2024
అజ్ఞాతంలోకి ప్రభాకర్‌రావు?

TG: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన SIB మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. మాజీ DSP ప్రతీణ్‌రావు అరెస్టుతో అప్రమత్తమైన ప్రభాకర్ USA వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. త్వరలోనే ఆయన హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. 2018 నుంచే ప్రభాకర్ ఆధ్వర్యంలో ట్యాపింగ్ సాగినట్లు భావిస్తున్న పోలీసులు.. ఇందుకోసం ఇజ్రాయెల్ నుంచి అత్యాధునిక పరికరాలు కొనుగోలు చేసినట్లు తేల్చారు.
Similar News
News April 20, 2025
శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండాయి. నిన్న 78,821 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 33,568 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.36 కోట్లు వచ్చింది.
News April 20, 2025
IPL: CSK ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే?

CSK ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో చివరి స్థానంలో ఉంది. ఇప్పటివరకు 7 మ్యాచులు ఆడి కేవలం రెండింట్లోనే గెలిచింది. దీంతో ప్లేఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన 7 మ్యాచుల్లో కచ్చితంగా 6 గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ 5 గెలిస్తే నెట్ రన్‌రేట్ మిగతా జట్ల కంటే మెరుగ్గా ఉండాలి. ప్రస్తుతం ధోనీ సేన NRR -1.276గా ఉంది. ఇది మెరుగవ్వాలంటే భారీ తేడాలతో మ్యాచులు గెలవాలి. CSK ప్లేఆఫ్స్‌కు చేరుతుందని అనుకుంటున్నారా? మీ కామెంట్.
News April 20, 2025
భారీగా పడిపోయిన ‘దొండ’ రేటు!

<<16113156>>ఉల్లి,<<>> టమాటా తరహాలోనే తెలుగు రాష్ట్రాల్లో దొండకాయల ధర భారీగా పడిపోయింది. ఇటీవల 10 కిలోల దొండ ధర రూ.300-325 పలకగా ప్రస్తుతం రూ.150-50కి పడిపోయింది. ఎకరా విస్తీర్ణంలో సాగుకు సగటున రూ.2 లక్షల వరకు ఖర్చవుతుంది. కొన్నిచోట్ల వ్యాపారులు కిలోకు రూ.5 మాత్రమే చెల్లిస్తుండటంతో పెట్టుబడి ఖర్చులూ రావట్లేదని అన్నదాతలు వాపోతున్నారు. అయితే బహిరంగ మార్కెట్లలో కిలో రేటు రూ.20-30 వరకు ఉండటం గమనార్హం.