News October 15, 2024
‘కంగువ’ ఆడియో లాంచ్‌కి రానున్న ప్రభాస్!

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘కంగువ’ సినిమాపై మరింత హైప్ పెంచేందుకు మేకర్స్ ప్రభాస్‌ను రంగంలోకి దింపనున్నారు. ఆడియో లాంచ్‌కి ప్రభాస్, రజినీకాంత్‌ను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. తన స్నేహితుడికి చెందిన UV క్రియేషన్స్ నిర్మిస్తుండటంతో ప్రభాస్ తప్పనిసరిగా వస్తారని సినీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ చిత్రం రూ.2వేల కోట్లు కలెక్ట్ చేస్తుందని ప్రొడ్యూసర్ కేఈ జ్ఞానవేల్ అంచనా వేశారు.
Similar News
News December 9, 2025
స్వాతంత్ర్య సమరాన్ని BJP వ్యతిరేకించింది: ఖర్గే

స్వాతంత్ర్య సమరం, దేశభక్తి గీతాలను వ్యతిరేకించిన చరిత్ర బీజేపీదని AICC చీఫ్ ఖర్గే విమర్శించారు. ‘గాంధీ పిలుపునిచ్చిన సహాయ నిరాకరణ ఉద్యమంలో వందేమాతరం అంటూ లక్షల మంది స్వాతంత్ర్య సమరయోధులు జైలుకు వెళ్లారు. అప్పుడు BJP సిద్ధాంతకర్తలు బ్రిటీషర్ల కోసం పనిచేస్తున్నారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పిలుపునిచ్చిన వందేమాతరం ఉద్యమంలో కాంగ్రెస్ కీలకంగా వ్యవహరించింది’ అని ఖర్గే రాజ్యసభలో వ్యాఖ్యానించారు.
News December 9, 2025
జామపండు తింటే ఎన్నో లాభాలు!

మార్కెట్‌లో విరివిగా లభించే జామపండును పోషకాల పవర్ హౌస్ అని పిలుస్తారు. ఇది నారింజ కంటే 4 రెట్లు అధికంగా విటమిన్ C అందించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉన్న పీచుపదార్థం చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది. కేవలం 60-70క్యాలరీలు మాత్రమే ఉండటం వల్ల బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. దేశీయ సూపర్ ఫ్రూట్ అయిన జామను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. share it
News December 9, 2025
ఘోర అగ్నిప్రమాదం.. 20 మంది మృతి

ఇటీవల తుఫాన్ బీభత్సంతో అతలాకుతలమైన ఇండోనేషియాలో మరో ఘోర ప్రమాదం సంభవించింది. రాజధాని జకార్తాలో ఓ ఏడంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం జరిగి 20 మంది మరణించారు. మరికొంత మంది గాయపడ్డారు. ఏరియల్ సర్వే కోసం ఉపయోగించే డ్రోన్ల తయారీ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్‌లో మొదలైన మంటలు వెంటనే భవనమంతా వ్యాపించాయి. ఆ సమయంలో కొందరు ఉద్యోగులు భోజనం చేస్తున్నారు. మంటలు చుట్టుముట్టడంతో వారంతా సజీవదహనం అయ్యారు.


