News August 13, 2024
‘రాజాసాబ్’ సెట్లో అడుగుపెట్టిన ప్రభాస్

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శంషాబాద్లో జరుగుతోంది. ఈ సెట్లో హారర్ సీన్స్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సూపర్ బజ్ క్రియేట్ చేసింది. మారుతి రూపొందిస్తున్న ఈ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ ఫీమేల్ రోల్ పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న మూవీ విడుదల కానుంది.
Similar News
News December 9, 2025
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమ్యాగ్నటిజమ్లో ఉద్యోగాలు

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమ్యాగ్నటిజమ్లో 14 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిప్లొమా, టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ(ఫిజిక్స్, మ్యాథ్స్, జియోఫిజిక్స్,జియాలజీ, ఎలక్ట్రానిక్స్, స్టాటిస్టిక్స్), ఎంఏ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. డిసెంబర్ 15లోపు దరఖాస్తు హార్డ్ కాపీని స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి. వెబ్సైట్: https://iigm.res.in/
News December 9, 2025
ఫ్యూచర్ సిటీలో ‘రేసింగ్ & మోటోక్రాస్’ కేంద్రం

TG: భారత్ ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ-ప్రామాణిక ‘రేసింగ్ & మోటోక్రాస్’ కొలువుదీరనుంది. ఈ ప్రాజెక్టు నెలకొల్పేందుకు ‘సూపర్క్రాస్ ఇండియా’ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. దీనిలో డర్ట్ ట్రాక్లు, రైడర్ శిక్షణ, ఇతర మౌలిక సదుపాయాలను కంపెనీ ఏర్పాటుచేయనుంది. ఇందులో ప్రపంచ రేసింగ్, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా జాతీయ, అంతర్జాతీయ ఛాంపియన్షిప్లను నిర్వహిస్తారు. భూమి, ఇతర ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందించనుంది.
News December 9, 2025
ప్రభాస్ క్షేమంగా ఉన్నారు: డైరెక్టర్ మారుతి

‘బాహుబలి: ది ఎపిక్’ ప్రచారంలో హీరో ప్రభాస్, నిర్మాత శోభు యార్లగడ్డ జపాన్లో పర్యటిస్తున్నారు. అయితే నిన్న అక్కడ భారీ <<18509568>>భూకంపం<<>> సంభవించడంతో డార్లింగ్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. దీంతో డైరెక్టర్ మారుతి స్పందించారు. ‘నేను ప్రభాస్తో మాట్లాడాను. ఆయన సురక్షితంగా ఉన్నారు. ఆందోళన అవసరం లేదు’ అని పేర్కొన్నారు.


