News March 24, 2025
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. త్వరలో ‘ది రాజాసాబ్’ టీజర్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తోన్న ‘ది రాజాసాబ్’ సినిమా టీజర్ విడుదలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే రఫ్ కట్ వీడియోను ఇండస్ట్రీ మిత్రులకు మారుతి చూపించగా.. ఫ్రభాస్ను ఇలా ఎప్పుడూ చూడలేదని అందరూ చెప్పినట్లు సినీవర్గాల్లో టాక్. డైలాగులు, ప్రభాస్ లుక్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తాయని సమాచారం. ఈ చిత్రం సర్ప్రైజింగ్ విజువల్ ట్రీట్ ఇవ్వనుందని సినీవర్గాలు తెలిపాయి.
Similar News
News November 21, 2025
తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో<<18346724>> గంటల<<>> వ్యవధిలోనే బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర ఉదయం స్వల్పంగా పెరగ్గా.. ఇప్పుడు రూ.500 తగ్గి రూ.1,23,980కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.450 పతనమై రూ.1,13,650 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఉదయం నుంచి ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,61,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News November 21, 2025
ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్.. ఈ దేశాల్లోనూ చెల్లుబాటు

ఇండియాలో తీసుకున్న డ్రైవింగ్ లైసెన్సులు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఫ్రాన్స్, యూకే, జర్మనీ, స్వీడన్, మలేషియా, స్పెయిన్, కెనడా, నార్వే, ఐర్లాండ్‌లో 6 నెలల నుంచి సంవత్సరం వరకు చెల్లుబాటవుతాయి. అయితే అవి ఇంగ్లిష్‌లో ప్రింట్ అయ్యుండాలి. మారిషస్‌లో ఇండియా డ్రైవింగ్ లైసెన్స్ 24 గంటలు మాత్రమే చెల్లుతుంది. ఇటలీలో మన లైసెన్స్‌తోపాటు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ ఉంటేనే డ్రైవింగ్‌కు అనుమతి ఉంటుంది.
News November 21, 2025
హారతిని కళ్లకు అత్తుకుంటున్నారా?

చాలామంది హారతిని కళ్లకు అత్తుకుంటారు. అయితే ఇలా చేయకూడదని పండితులు చెబుతున్నారు. దేవుడికి దిష్టి తీయడం కోసమే హారతి ఇస్తారని, దాన్ని కళ్లకు అత్తుకోకూడదని సూచిస్తున్నారు. ‘ఇంట్లో, చిన్న పిల్లలకు చెడు దృష్టి తగలకుండా దిష్టి తీసినట్లే స్వామివారికి దృష్టి దోషం పోవడానికే హారతి ఇస్తారు. అందులో ఏ సానుకూల శక్తి ఉండదు. దిష్టి తీసిన గుమ్మడికాయను వదిలేసినట్లే హారతిని కూడా వదిలేయాలి’ అని వివరిస్తున్నారు.


