News November 13, 2024

ఒక్కటవుతున్న పాక్ & USకు చెందిన ప్రభాస్ అభిమానులు

image

పాకిస్థాన్ & USకు చెందిన ప్రభాస్ అభిమానులు ఇయాజ్, లారెన్ ఒక్కటవుతున్నారు. వీరిద్దరూ ఏడాదిన్నర క్రితం సోషల్ మీడియాలో పరిచయమై ప్రేమలో పడ్డారు. త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించారు. ‘రెండు వేర్వేరు దేశాలకు చెందిన ఇద్దరు ప్రభాస్ వీరాభిమానులు కలిసి తమ జీవితాలను ఆస్వాదించబోతున్నారు. లారెన్ కోసం సప్త సముద్రాలను దాటొచ్చా’ అని ఇయాజ్ ట్వీట్ చేశారు. కాగా ప్రభాస్ ఫ్యాన్స్ వీరికి విషెస్ చెబుతున్నారు.

Similar News

News January 24, 2026

84 ఏళ్ల డైరెక్టర్‌తో 74 ఏళ్ల హీరో సినిమా

image

మలయాళ ఇండస్ట్రీలో అరుదైన కాంబోలో మూవీ తెరకెక్కనుంది. లెజెండరీ డైరెక్టర్ అదూర్ గోపాలకృష్ణన్ 84 ఏళ్ల వయసులో మళ్లీ దర్శకత్వం చేయనున్నారు. 74 ఏళ్ల మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించనున్నారు. 32 ఏళ్ల క్రితం ‘విధేయన్’ వంటి క్లాసిక్ తర్వాత వీరిద్దరూ మళ్లీ కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. ‘పాదయాత్ర ’ పేరుతో ఈ కొత్త సినిమా తెరకెక్కనుంది. తెలుగులో మమ్ముట్టి ‘యాత్ర’లో నటించిన విషయం తెలిసిందే.

News January 24, 2026

న్యూజిలాండ్‌పై భారత్ ఘనవిజయం

image

U19-WCలో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. వర్షం ఆటంకం కలిగించడంతో DLS ప్రకారం 130 పరుగులకు కుదించిన <<18946505>>లక్ష్యాన్ని<<>> 13.3 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ ఆయుశ్ 27 బంతుల్లో 6 సిక్సర్లు, 2 ఫోర్లతో 53 రన్స్ చేయగా ఓపెనర్ వైభవ్ 23 బంతుల్లో 3 సిక్సర్లు, 2 ఫోర్లతో 40 రన్స్ చేశారు. వీరిద్దరు ఔటైనా మల్హోత్రా, త్రివేది జట్టును విజయతీరాలకు చేర్చారు. NZ బౌలర్లలో క్లర్క్, సంధు, సంజయ్ తలో వికెట్ తీశారు.

News January 24, 2026

సింగరేణి రికార్డులను సీజ్ చేయాలి: మంత్రి సంజయ్

image

TG: ఉమ్మడి APలో కన్నా ప్రస్తుత BRS, INC పాలనలోనే సింగరేణి ఎక్కువ దోపిడీకి గురైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అక్రమాలకు సంబంధించి రికార్డులు తారుమారయ్యే ప్రమాదం ఉందని, వాటిని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ‘ఫోన్ ట్యాపింగ్ కేసులో KTRను సాక్షిగా పిలిచామని మంత్రులు అంటుంటే విచారణకు పిలిచామని సజ్జనార్ చెబుతున్నారు. ఏది నిజం? KTR, KCRలకు ప్రభుత్వం క్లీన్ చిట్ ఇస్తోందా?’ అని ప్రశ్నించారు.