News July 18, 2024
అక్టోబర్‌లో సెట్స్‌పైకి ప్రభాస్ ‘ఫౌజీ’?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కించనున్న ‘ఫౌజీ’ మూవీ అక్టోబర్ మొదటి వారంలో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ‘స్పిరిట్’ ప్రీ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం పడుతుండటంతో ఫౌజీని స్టార్ట్ చేసేందుకు ప్రభాస్ ప్లాన్ చేస్తున్నారట. 1940ల నాటి కథ నేపథ్యంలో సాగే ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్నట్లు టాక్. ప్రభాస్ ఈ మూవీలో జవాన్ పాత్రలో కనిపించనున్నారు.
Similar News
News January 23, 2025
నా ఎదుగుదలకు వారే కారణం: అభిషేక్ శర్మ
క్రికెటర్‌గా తన ఎదుగుదలకు యువరాజ్ సింగ్, లారా, వెటోరి తోడ్పడ్డారని, ఇప్పుడు గౌతమ్ గంభీర్ అండగా నిలుస్తున్నారని అభిషేక్ శర్మ తెలిపారు. ఇంగ్లండ్‌తో తొలి టీ20 అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. విఫలం అవుతాననే భయం లేకుండా సొంత శైలిలో ఆడమని కోచ్, కెప్టెన్ తనకు చెప్పారని పేర్కొన్నారు. అదే తనకు కాన్ఫిడెన్స్ ఇచ్చిందన్నారు. తొలి టీ20లో అభిషేక్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే.
News January 23, 2025
యుద్ధం ఆపాల్సిందే.. పుతిన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపాలని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను హెచ్చరించారు. లేదంటే భారీ ఆంక్షలు విధిస్తామని స్పష్టం చేశారు. రష్యా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై భారీగా పన్నులు, టారిఫ్‌లు విధిస్తామని తెలిపారు. తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఈ వార్ ప్రారంభమయ్యేదే కాదన్నారు. యుద్ధానికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని, ఇక నుంచి ఒక్క ప్రాణం కూడా పోయేందుకు వీల్లేదన్నారు.
News January 23, 2025
ఫోన్ ఛార్జింగ్ పెట్టి పడుకుంటున్నారా?
మొబైల్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయకూడదని నిపుణులు అంటున్నారు. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయ్యేవరకు వెయిట్ చేయకూడదు. 80 శాతానికి చేరుకోగానే అన్‌ప్లగ్ చేయాలి. అలాగే రాత్రి పూట ఫోన్ ఛార్జింగ్ పెట్టి నిద్రపోకూడదు. ఫుల్ ఛార్జ్ అయ్యేదాకా లేదా ఎక్కువ గంటలు ప్లగ్ ఇన్ చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. ఇంకా ఛార్జింగ్ ఎప్పుడూ జీరోకు రాకుండా చూడాలి. 20% కంటే తగ్గకముందే ఫోన్ ఛార్జ్ చేయడం ఉత్తమం.