News August 8, 2025
ప్రభాస్ ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ ఫిక్స్?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ఫౌజీ’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని గుడ్ ఫ్రైడే సందర్భంగా 2026 APR 3న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుందని టాక్. అలాగే పాటలు తప్ప మిగతా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తున్నారు.
Similar News
News August 8, 2025
బండి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కోర్టుకు లాగుతా: KTR

TG: ఫోన్ ట్యాపింగ్ అంశంలో బండి సంజయ్ చేసిన <<17342231>>వ్యాఖ్యలపై<<>> మాజీ మంత్రి KTR ఫైర్ అయ్యారు. ‘సంజయ్ స్టేట్‌మెంట్స్ హద్దు మీరాయి. హోంశాఖ మంత్రి అయినా ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందన్న ఇంగిత జ్ఞానం లేదని అర్థమైంది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు నిరూపించాలని ఆయనకు సవాల్ విసురుతున్నా. 48 గంటల్లో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పకపోతే లీగల్ నోటీసులు పంపి కోర్టుకు లాగుతా’ అన్నారు.
News August 8, 2025
ప్రధాని మోదీకి చైనా స్వాగతం

ఈ నెల 31, సెప్టెంబర్ 1 తేదీల్లో జరగబోయే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(SCO)లో పాల్గొనేందుకు వెళ్లనున్న భారత PM మోదీకి చైనా స్వాగతం పలికింది. కాగా ఏడేళ్ల తర్వాత మోదీ చైనాలో పర్యటించనున్నారు. చివరిసారి 2018లో అక్కడికి వెళ్లారు. గల్వాన్ లోయలో భారత్, చైనా సైన్యం ఘర్షణల తర్వాత ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీటిని పునరుద్ధరించేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి.
News August 8, 2025
అల్పపీడనం.. భారీ వర్షాలు

AP: పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో ఈనెల 13 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ప్రస్తుతం దక్షిణ కోస్తా నుంచి ఉత్తర శ్రీలంక వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోందని చెప్పింది. దీని ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో మోస్తరు వానలు పడొచ్చని వెల్లడించింది.