News January 27, 2025
కన్నప్ప నుంచి ఫిబ్రవరి 3న ప్రభాస్ ఫస్ట్ లుక్

ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే న్యూస్. కన్నప్ప సినిమాలో ఆయన ఓ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ లుక్ను ఫిబ్రవరి 3న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్లో త్రిశూలం మధ్య ప్రభాస్ కళ్లు కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. రూ.100 కోట్లకు పైగా బడ్జెట్తో హిస్టారికల్ కం మైథాలజీ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది.
Similar News
News December 22, 2025
ఆస్తి పన్ను బకాయిలపై భారీ డిస్కౌంట్

TG: ఆస్తి పన్నుకు సంబంధించి HYD వాసులకు ప్రభుత్వం ‘వన్ టైం స్కీమ్’ (OTS) ప్రకటించింది. తాజాగా విడుదలైన G.O.Rt.No.869 ప్రకారం పాత బకాయిలపై ఉన్న వడ్డీలో 90% రద్దు చేస్తోంది. అసలు పన్ను మొత్తంతో పాటు కేవలం 10% వడ్డీని ఒకేసారి చెల్లిస్తే సరిపోతుంది. ప్రైవేట్ యజమానులకు, ప్రభుత్వ సంస్థలకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈ వెసులుబాటు వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
News December 22, 2025
GHMC డీలిమిటేషన్పై పిటిషన్ల కొట్టివేత

TG: GHMC డీలిమిటేషన్పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలను ఇటీవల గ్రేటర్లో విలీనం చేసిన ప్రభుత్వం వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. దీనిపై అభ్యంతరాలు తెలుపుతూ కొందరు పిటిషన్లు దాఖలు చేశారు.
News December 22, 2025
అమరావతిలో వరదనీటి ఎత్తిపోతకు మరో లిఫ్ట్

AP: వరద నీటిని ఎత్తిపోయడానికి ₹444Crతో మరో లిఫ్ట్ ప్రాజెక్టుకు CM CBN ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో CRDA ఆమోదం తెలిపింది. క్వాంటం కంప్యూటింగ్ సెంటర్లో ₹103.96Crతో రీసెర్చ్ సెంటర్, LPS జోన్8లో ₹1358 కోట్లతో లేఅవుట్ల అభివృద్ధి, IAS క్వార్టర్లలో ₹109Crతో అదనపు సౌకర్యాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 202ఎకరాలు జరీబా లేదా మెట్టా తేల్చేందుకు కమిటీ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే కొండవీటి వాగుపై ఒక లిఫ్ట్ ఉంది.


