News June 23, 2024
‘కల్కి’ రిలీజ్ వేళ యూరప్ వెకేషన్కు ప్రభాస్?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ యూరప్ పర్యటనకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఎప్పుడు బ్రేక్ తీసుకోవాలన్నా ఇటలీ వెళ్తారు. అక్కడ తనకు ఉన్న లగ్జరీ విల్లాలో ఆయన ఎంజాయ్ చేస్తారు. షూటింగ్లతో బిజీగా ఉంటే పర్యాటకులకు ఆ విల్లాను అద్దెకిస్తారు. అద్దె ద్వారా ఆయన నెలకు రూ.40 లక్షలు సంపాదిస్తున్నట్లు టాక్. కాగా ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీ ఈ నెల 27న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
Similar News
News November 18, 2025
ఎన్కౌంటర్స్ మొత్తం ఫేక్: కూనంనేని

మావోయిస్టులపై జరుగుతున్న ఎన్కౌంటర్లు మొత్తం ఫేక్ అని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మావోయిస్టులను చంపుకుంటూ పోవడం మానవ హననమేనని, ఇది జంగిల్ రాజ్ పరిపాలనకు పరాకాష్ట అని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ పోలీసులు ఇందులో పావులుగా మారారని ఆరోపించారు. మాడేరుమిల్లిలో జరిగిన హిడ్మా ఎన్కౌంటర్తో సహా అన్ని ఎన్కౌంటర్లు కట్టుకథలని ఆయన స్పష్టం చేశారు.
News November 18, 2025
ప్రతి కశ్మీరీ ముస్లింను అనుమానించొద్దు: ఒమర్ అబ్దుల్లా

ఢిల్లీ బాంబు బ్లాస్ట్ కేసులో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్స్తో సంబంధమున్న అందరినీ కఠినంగా శిక్షించాలని J&K CM ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. అదే సమయంలో అమాయక పౌరులను వేధించొద్దన్నారు. ప్రతి కశ్మీరీ ముస్లింని అనుమానించొద్దని నార్త్ జోన్ CMల సమావేశంలో కోరినట్లు చెప్పారు. పేలుళ్ల నేపథ్యంలో కశ్మీరీ పౌరులను టెర్రరిస్టు సింపథైజర్లుగా భావించరాదన్నారు. నౌగామ్ PS పేలుడు బాధితుల్ని ఆయన పరామర్శించారు.