News March 30, 2024
‘కన్నప్ప’ మూవీ షూట్‌కు ప్రభాస్?

మంచు విష్ణు లీడ్ రోల్‌లో ‘కన్నప్ప’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో స్టార్ హీరో ప్రభాస్ శివుడి పాత్రలో నటిస్తున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూట్ కోసం ప్రభాస్ డేట్స్ ఇచ్చినట్లు సినీ వర్గాలు తెలిపాయి. వచ్చే నెల 12 నుంచి ఐదు రోజుల పాటు రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే షూటింగ్‌లో పాల్గొంటారని పేర్కొన్నాయి.
Similar News
News March 21, 2026
పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్ సీజ్

TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. పార్టీకి ఉపయోగించిన ఫామ్‌హౌస్‌ను పోలీసులు సీజ్ చేశారు. అసైన్డ్ భూమిలో దాన్ని కట్టారని అధికారులు తేల్చగా, పోలీసులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు పార్టీకి వచ్చినవారి వాహనాలనూ సీజ్ చేశారు.
News March 21, 2026
ఏ ముఖం పెట్టుకొని సిద్దిపేటకు వస్తున్నావ్ రేవంత్: హరీశ్ రావు

TG: సిద్దిపేట జిల్లా నర్మెట్టకు రేపు సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు ఆయనకు బహిరంగ లేఖ రాశారు. ‘మీరు ప్రారంభించే పనులు కాంగ్రెస్ చేసినవి కావు. శ్రమ మాది శిలాఫలకాలు కాంగ్రెస్‌వి. ఆయిల్ ఫామ్‌కు ప్రాణాధారం కాళేశ్వరం ప్రాజెక్టే. దానిపై మీ వైఖరి మార్చుకోవాలి. 3 పంటలకు రైతుబంధు ఎగ్గొట్టారు. రుణమాఫీ కూడా చేయలేదు. ఏ ముఖం పెట్టుకొని సిద్దిపేట వస్తున్నారు’ అని హరీశ్ ప్రశ్నించారు.
News March 21, 2026
USకు ఇరాన్ పంచ్.. 4000km దూరంలోని బేస్‌పైకి మిస్సైళ్లు

యుద్ధంలో ఇరాన్ దాడులు US, ఇజ్రాయెల్‌తో పాటు ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా ఇండియానా ఓషన్‌లో ఉన్న US-UK మిలిటరీ బేస్ డియాగో గార్షియాపై 2 బాలిస్టిక్ మిస్సైళ్లు సంధించింది. ఇది ఇరాన్‌కు ఏకంగా 4000km దూరంలో ఉండటం గమనార్హం. టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ఒక మిస్సైల్ గాల్లోనే పేలిపోయిందని US తెలిపింది. మరొకదాన్ని తమ SM-3 ఇంటర్‌సెప్టర్ అడ్డుకుందని పేర్కొంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.


